మిస్టర్ బచ్చన్ ఎఫెక్ట్.. ఉస్తాద్ స్క్రిప్ట్ లో మార్పులు..?

murali krishna
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో రాబోతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ గా మారింది. గబ్బర్ సింగ్' తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో, ఫ్యాన్స్ భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు.కానీ, ఈ ప్రాజెక్ట్ షూటింగ్ అనేక కారణాల వల్ల ఆలస్యం కావడం మరో వర్గం ఫ్యాన్స్‌ను నిరాశపరిచింది ఇటీవల 'మిస్టర్ బచ్చన్' ప్రమోషన్లలో కూడా హరీష్ శంకర్, 'ఉస్తాద్ భగత్ సింగ్' గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ చిత్రం ఎప్పుడు విడుదలైనా, అది బ్లాక్ బస్టర్ హిట్ అవడం ఖాయం అని తన ధీమాను వ్యక్తం చేశారు.పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ సినిమాను జీవితాంతం గుర్తుంచుకుంటారని హరీష్ అన్నారు. ఈ వ్యాఖ్యలు ఫ్యాన్స్‌లో మరోసారి ఉత్సాహం నింపాయి.
 ఇదిలావుండగా మిస్టర్ బచ్చన్’ ఫ్లాప్ ఎఫెక్ట్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై పడినట్టుగా.. ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.మిరపకాయ్ తర్వాత మాస్ మహారాజా రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన ‘మిస్టర్ బచ్చన్’ భారీ అంచనాల మధ్య థియేటర్లోకి వచ్చింది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేసింది. వాస్తవానికైతే.. హరీష్ శంకర్ ముందుగా పవర్ స్టార్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కంప్లీట్ చేయాల్సి ఉంది. కానీ పవన్ రాజకీయంగా బిజీ అవడంతో.. ఈలోపు మిస్టర్ బచ్చన్‌ను టేకప్ చేశాడు హరీష్. జెట్ స్పీడ్‌లో ఈ సినిమాను పూర్తి చేసి రిలీజ్ చేశాడు. కానీ సీన్ రివర్స్ అయింది.

ఇక్కడి నుంచి ఉస్తాద్ పై కూడా డౌట్స్ స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే.. ఈ సినిమా తేరి రీమేక్ అనే టాక్ ఉంది. కానీ ఉస్తాద్ విషయంలో హరీష్ రీమేక్ మార్క్ మిస్ అయింది.దీంతో.. ఉస్తాద్‌తో హరీష్ మెప్పిస్తాడా? అనే టాక్ నడుస్తోంది. ఇప్పటికే కొంత వరకు ఈ సినిమా షూటింగ్ జరుపుకుంది. త్వరలోనే పవన్ సెట్స్ పై ఉన్న సినిమాలు కంప్లీట్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఉస్తాద్ మేకర్స్ కూడా పవన్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పుడు ఉస్తాద్ స్క్రిప్టులో మార్పులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. తన రైటర్స్ టీమ్‌తో హరీష్ ఇదే విషయంపై చర్చలు జరుపుతున్నాడనేది ఇండస్ట్రీ ఇన్‌సైడ్ టాక్. ప్రజెంట్ హరీష్ శంకర్ ఫోకస్ మొత్తం ఉస్తాద్ పైనే ఉందని అంటున్నారు. ఎట్టి పరిస్థితిల్లోను ఉస్తాద్‌తోదుమ్ముదులిపేయాలని హరీష్ భావిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్‌కు సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. ఏపి ఎన్నికల సమయంలో గాజు గ్లాస్‌ను హైలెట్ చేస్తూ కట్ చేసిన గ్లింప్స్‌ పవన్ ఫ్యాన్స్‌కు తెగ నచ్చేసింది. కాబట్టి.. గబ్బర్ సింగ్ రిజల్ట్‌ను ఈ సినిమాతో హరీష్ శంకర్ రిపీట్ చేస్తాడనే నమ్మకంతో ఉన్నారు అభిమానులు. అయితే.. ఉస్తాద్ స్క్రిప్టులో మార్పులు ఎంత వరకు నిజముందనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: