వీడియో: అదిరిపోయే ట్విస్ట్.. క్యాచ్ మిస్ అయినా బ్యాటర్ ఔట్..??
జారిపోయిన బంతి బౌలర్ చేతికి తగిలి నేరుగా నాన్-స్ట్రైకర్ ఎండ్‌లోని వికెట్లను తాకింది. క్రీజ్‌కు కొద్ది దూరంగా ఉన్న బ్యాట్స్‌మెన్ రనౌట్ అయ్యాడు. క్యాచ్ తప్పించుకున్నానని ఊపిరి పీల్చుకున్న బ్యాట్స్‌మెన్‌కు క్షణాల్లోనే షాక్ తగిలింది. అప్పటివరకు హీరో అనుకున్న బ్యాట్స్‌మెన్ ఒక్కసారిగా జీరో అయ్యాడు. ఈ విచిత్రమైన రనౌట్‌తో స్టేడియం మొత్తం ఒక్కసారిగా నవ్వులతో హోరెత్తింది. అంతేకాదు ఆ పోలార్ కూడా ఎంతో ఆశ్చర్యపోయాడు. జార విడిచిన బంతే బ్యాటర్ ను ఔట్ చేసిందని తెలిసి అతను చాలా సంతోషించాడు. బౌలర్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడో, ఈ ఔట్ ను ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు వైరల్ వీడియోలో చూడవచ్చు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఫన్నీ కామెంట్లతో హోరెత్తించారు. "తలా 7 ఫర్ ఏ రీజన్" అంటూ ఒక యూజర్ చేసిన కామెంట్ తెగ వైరల్ అయింది. అంటే, ఆ బౌలర్ 7 నంబర్ ఉన్న జెర్సీ ధరించాడు. అది ధోనీ వేసుకునే జెర్సీ. అతను కూడా ఇలాగే ఎవరూ ఊహించని విధంగా బ్యాటర్లను రన్ అవుట్ చేస్తాడు. అందుకే ధోనితో పోల్చి మరీ ఇతన్ని పొగిడేస్తున్నారు. ఈ విచిత్రమైన రనౌట్‌ను కొందరు "క్రికెట్ చరిత్రలోనే బెస్ట్ రనౌట్" అని అభివర్ణించారు. ఏది ఏమైనా, ఈ ఘటన క్రికెట్‌లో అదృష్టం, దురదృష్టం ఎలా మారుతుంటాయో చెప్పకనే చెబుతోంది. క్రికెట్ ఎప్పుడూ ఊహించని ట్విస్టులతో నిండి ఉంటుందని మరోసారి రుజువైంది.