టాలీవుడ్ స్టార్ శ్రీలీల.. సక్సెస్ కోసం ఎక్కడ అడ్డంకులు?
ఇటీవల సంక్రాంతి కానుకగా విడుదలైన తమిళ చిత్రం 'పరాశక్తి' శ్రీలీల కెరీర్‌లో ఒక టర్నింగ్ పాయింట్‌గా మారింది. శివకార్తికేయన్ సరసన నటించిన ఈ సినిమాలో ఆమె కేవలం గ్లామర్ కే పరిమితం కాకుండా, నటనకు ఆస్కారమున్న పాత్రలో మెప్పించింది. "మొదటిసారి నా పాటల గురించి కాకుండా, నా నటన గురించి మాట్లాడుతుంటే చాలా ఆనందంగా ఉంది" అని శ్రీలీల ఎమోషనల్ అయ్యింది. నేషనల్ అవార్డ్ విన్నర్ సుధా కొంగర ఈ సినిమాలో శ్రీలీలను ఒక కొత్త యాంగిల్ లో చూపించడంలో సక్సెస్ అయ్యారు.
తెలుగులో శ్రీలీలకు గత ఏడాది కాలంగా కాలం కలిసి రావడం లేదు. 'స్కంద', 'ఆదికేశవ', 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. ఈ వరుస ఫ్లాపులతో ఆమె క్రేజ్ తగ్గిందని కొందరు అంటుంటే, మరికొందరు మాత్రం "బాస్ సినిమా వస్తే మళ్ళీ ఫామ్ లోకి వస్తుంది" అని ఆశలు పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ సరసన నటిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా ఇప్పుడు ఆమెకు అత్యంత కీలకం. ఈ సినిమా హిట్ అయితేనే శ్రీలీల మళ్ళీ టాలీవుడ్ నెంబర్ వన్ రేసులోకి వస్తుంది.తెలుగులో గ్యాప్ తీసుకుని శ్రీలీల బాలీవుడ్ వైపు అడుగులు వేసింది. కార్తీక్ ఆర్యన్ మరియు ఇబ్రహీం అలీ ఖాన్ సరసన భారీ ప్రాజెక్టులను లైన్ లో పెట్టింది. అయితే, బాలీవుడ్ మార్కెట్ అంత ఈజీ కాదని, అక్కడ నిలదొక్కుకోవాలంటే కేవలం గ్లామర్ సరిపోదని, పర్ఫెక్ట్ స్క్రిప్ట్స్ ఎంచుకోవాలని ట్రేడ్ పండితులు సూచిస్తున్నారు.
మొత్తానికి శ్రీలీల తన కెరీర్‌ను రీసెట్ చేసే పనిలో ఉంది. రొటీన్ మాస్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి, నటనకు ప్రాధాన్యత ఉన్న కథలను ఎంచుకుంటోంది. టాలెంట్ పుష్కలంగా ఉన్న ఈ 'బ్యూటీ విత్ బ్రెయిన్' సరైన హిట్ పడితే మళ్ళీ బాక్సాఫీస్ దగ్గర దండయాత్ర చేయడం ఖాయం. ఆ విజయం 'ఉస్తాద్ భగత్ సింగ్' తోనే మొదలవ్వాలని కోరుకుందాం!