ఏపీ మంత్రులకు చంద్రబాబు రేటింగ్లు.. టాప్ - 4 లిస్ట్ ఇదే...!
ఇక రెండో స్థానంలో భారీ నీటిపారుదల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు నిలిచారు. మూడో స్థానంలో టీజీ భరత్ ఉన్నారు. నాలుగో స్థానంలో కొండపల్లి శ్రీనివాస్ ఉన్నారు. టాప్ 4 ర్యాంకుల్లో ఉన్న మంత్రుల్లో 3,4 స్థానాల్లో ఉన్న టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాస్ తొలిసారి ఎమ్మెల్యేలు కావడం విశేషం. అందులోనూ భరత్ రెండోసారి పోటీ చేసి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైతే .. కొండపల్లి శ్రీనివాస్ తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యే అవ్వడంతో పాటు మంత్రి అయ్యి.. ఇప్పుడు మంచి ర్యాంక్ కొట్టేశారు ..
ఇక తర్వాత స్థానంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో అందరికంటే చివరలో హోం మంత్రి వంగలపూడి అనిత ఉన్నట్టు సమాచారం. మంత్రులు ఫైళ్లను పెండింగ్లో పెట్టకుండా నిర్ణీత సమయంలోగా క్లియర్ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. పరిపాలనలో వేగం ఉంటేనే ప్రజలకు మెరుగైన సేవలు సకాలంలో అందుతాయని, దీనిపై మంత్రులందరూ ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు. .