గోంధల్ మూవీ రివ్యూ & రేటింగ్!

Reddy P Rajasekhar


నటీనటులు: ఇషితా దేశ్‌ముఖ్, యోగేష్ సోహోని, కిషోర్ కదమ్, నిషాద్ భోయిర్, అనుజ్ ప్రభు, సురేష్ విశ్వకర్మ

దర్శకత్వం: సంతోష్ దావఖర్

నిర్మాతలు: సంతోష్ దావఖర్, దీక్ష దావఖర్

సంగీతం: ఇళయరాజా

ఛాయాగ్రహణం: అమలేందు చౌధురి

కూర్పు: ఆశిష్ మాత్రే

కథా నేపథ్యం:
మహారాష్ట్రలోని ఒక మారుమూల గ్రామంలో జరిగే ఇతివృత్తం ఇది. సంపన్న కుటుంబానికి చెందిన ఆనంద్‌రావ్ (యోగేష్ సోహోని)తో సుమన్ (ఇషితా దేశ్‌ముఖ్) వివాహం జరుగుతుంది. కొత్త దంపతుల కాపురం సజావుగా సాగాలని కోరుకుంటూ ఆ ఇంటిలో సాంప్రదాయబద్ధంగా రాత్రి పూట 'గోంధల్' (జాగరణ్) పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అయితే, ఆ వివాహం ఇష్టం లేని సుమన్ తన ప్రియుడితో పారిపోవాలని పథకం వేస్తుంది. మరోవైపు గ్రామపెద్ద కుమారుడైన సర్జేరావ్ (నిషాద్ భోయిర్) మోజులో పడి, తన భర్తను అడ్డు తొలగించుకోవడానికి సుమన్ చేసే ప్రయత్నాలు ఏటువంటి ప్రమాదకర మలుపులకు దారితీశాయి? ఆ రాత్రి జరిగే గోంధల్ పూజ మధ్యలో బయటపడిన రహస్యాలు, కుట్రలు ఏమిటి? చివరికి ఈ ఉత్కంఠభరిత కథ ఎానికి ముగిసింది? అన్నదే ఈ చిత్ర కథ.

ప్లస్ పాయింట్స్:
అద్భుతమైన నటన: ప్రధాన పాత్రల్లో నటించిన ఇషితా దేశ్‌ముఖ్, యోగేష్ సోహోని, నిషాద్ భోయిర్ మరియు అనుభవజ్ఞుడైన నటుడు కిషోర్ కదమ్ తమ పాత్రల్లో ఒదిగిపోయి అద్భుతమైన అభినయాన్ని కనబపరిచారు. ముఖ్యంగా క్లైమాక్స్ ఘట్టంలో వీరి నటన సినిమాకే హైలైట్‌గా నిలుస్తుంది.

ఇళయరాజా సంగీతం & నేపథ్య సంగీతం: లెజెండరీ సంగీత దర్శకుడు ఇళయరాజా అందించిన నేపథ్య సంగీతం (BGM) ఈ చిత్రానికి నిజంగానే ప్రాణం పోసింది. డప్పుల చప్పుళ్లు, జానపద బాణీలతో పాటు నిశ్శబ్దాన్ని కూడా ఆయన వాడుకున్న తీరు సన్నివేశాల్లోని ఉత్కంఠను రెట్టింపు చేసింది.

సాంకేతిక నిపుణులు & ప్రయోగాలు: సినిమాలోని 25 నిమిషాల సింగిల్-టేక్ సన్నివేశం దర్శకుడి ప్రతిభకు అద్దం పడుతుంది. అమలేందు చౌధురి సినిమాటోగ్రఫీ రాత్రిపూట లైటింగ్‌లో గ్రామీణ వాతావరణాన్ని చాలా సహజంగా, అద్భుతంగా తెరపై ఆవిష్కరించింది.

నేపథ్యం & ఆచారం: గోంధల్ అనే ప్రాచీన జానపద సాంప్రదాయాన్ని, నేటి మానవ నైజంలోని వ్యామోహం, పగ, కుట్రలతో ముడిపెట్టి ఒక కొత్త జోనర్‌లో సినిమాను తెరకెక్కించిన విధానం ఆకట్టుకుంటుంది.

విశ్లేషణ:
ఆస్కార్ బరిలో భారత్ తరఫున అధికారికంగా ఎంపికై భారీ అంచనాలను మోసుకొచ్చిన ఈ మరాఠీ థ్రిల్లర్, సాధారణ కమర్షియల్ హంగులకు భిన్నంగా పూర్తిగా నేటివిటీతో సాగుతుంది. ఇంటర్వెల్ వరకు కథనం కొంత నెమ్మదిగా సాగినప్పటికీ, ద్వితీయార్థంలో రాత్రిపూట జరిగే గోంధల్ ఆచారం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను సీట్లలో కదలకుండా కూర్చోబెడతాయి. క్లైమాక్స్‌లో కొన్ని మలుపులు కొద్దిగా నాటకీయంగా అనిపించినా, దర్శకుడు ఎంచుకున్న కథాంశం, కళాకారుల ప్రతిభ సినిమా స్థాయిని పెంచాయి. కొత్తదనం కోరుకునే థ్రిల్లర్ జోనర్ సినిమాల ప్రేమికులకు ఈ చిత్రం ఒక మంచి అనుభూతిని పంచుతుంది.

రేటింగ్: 3 / 5

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: