నో రూల్స్ గేమ్ మొదలు.. మ్యారేజ్ తర్వాత యాక్షన్ మోడ్‌లోకి టాలీవుడ్ హీరోయిన్!
టైగర్ ష్రాఫ్ తన సినిమాల్లో భారీ యాక్షన్ సీక్వెన్స్ చేస్తూ కుర్రకారులో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఆయన సరసన ఇప్పటివరకు చాలామంది గ్లామర్ భామలు నటించారు. కానీ, కీర్తి సురేష్ లాంటి పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ హీరోయిన్ ఆయన పక్కన నటిస్తుండటంతో, ఈ సినిమాలో ఎమోషన్స్ కూడా పీక్స్‌లో ఉండబోతున్నాయని అర్థమవుతోంది. మ్యాసివ్ యాక్షన్ కు తోడు కీర్తి సురేష్ మార్క్ ఎమోషన్ కలిస్తే థియేటర్లలో రచ్చ మామూలుగా ఉండదు.తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో మరో యాక్షన్ స్టార్ విద్యుత్ జమ్వాల్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అంటే ఇద్దరు భారీ యాక్షన్ హీరోల మధ్య కీర్తి సురేష్ తన నటనతో మేజిక్ చేయబోతోంది. ఈ ప్రాజెక్టును మిలాప్ జవేరి దర్శకత్వం వహిస్తున్నట్లు సమాచారం. ఇది ఒక పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కబోతోంది. ఈ సినిమా కోసం కీర్తి సురేష్ భారీ రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.
కేవలం బాలీవుడ్ మాత్రమే కాదు, సౌత్‌లో కూడా కీర్తి సురేష్ చేతిలో అరడజనుకు పైగా ప్రాజెక్టులు ఉన్నాయి.విజయ్ దేవరకొండతో: 'రౌడీ జనార్ధన'లో తారక్ సరసన నటిస్తోంది.తమిళం & మలయాళం: 'కన్నివేడి', 'తొట్టం' వంటి సినిమాలతో బిజీగా ఉంది.వైఆర్ఎఫ్ (YRF) నిర్మాణంలో 'అక్క' అనే పవర్‌ఫుల్ వెబ్ సిరీస్‌తో హిందీ డిజిటల్ మార్కెట్‌లోకి కూడా ఎంట్రీ ఇస్తోంది.మొత్తానికి 'బేబీ జాన్' పరాజయం కీర్తి సురేష్ కెరీర్‌కు ఎలాంటి ఆటంకం కలిగించలేదు. సరికదా, ఆమె క్రేజ్ హిందీ బెల్ట్‌లో మరింత పెరిగింది. టైగర్ ష్రాఫ్‌తో చేయబోయే ఈ సినిమా కీర్తికి బాలీవుడ్‌లో ఒక బలమైన పునాది వేస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. 'మహానటి' తన యాక్టింగ్ తో హిందీ ఆడియన్స్ ను కూడా బుట్టలో వేసుకోవడం ఖాయం!