తమిళ్లో ఓకే.. మిగతా అంతటే సూపర్ స్లో.. రెండవ రోజు ది గోట్ పరిస్థితి ఇది..?

Pulgam Srinivas
తలపతి విజయ్ తాజాగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన ది గోట్ అనే కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీలో హీరో గా నటించాడు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా మంచి అంచనాల నడుమ సెప్టెంబర్ 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ కి సంబంధించిన 2 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ఇప్పటివరకు కంప్లీట్ అయింది. 2 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్ లు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.

ఈ మూవీ కి 2 రోజుల్లో తమిళ నాడు ఏరియాలో 53.49 కోట్ల కలెక్షన్లు రాగా , రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 5.60 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. కర్ణాటక ఏరియాలో 13.25 కోట్ల కలెక్షన్లు రాగా , కేరళ ఏరియాలో 7.15 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఈ మూవీ కి మొదటి రోజు 5.85 కోట్ల కలెక్షన్లు రాగా , ఓవర్ సీస్ లో 74.49 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా ఈ మూవీ కి 2 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 78.40 కోట్ల షేర్ ... 159.65 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 185 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 187 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా బ్రేక్ ఈవెన్ ఫార్ములా అండ్ కంప్లీట్ చేసుకొని హిట్ స్టేటస్ ను అందుకోవాలి అంటే మరో 108.60 కోట్ల షేర్ కలెక్షన్లను రాబట్టవలసి ఉంది. మరి ఈ సినిమా ఏ స్థాయి కలెక్షన్లను రాబట్టి ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ప్రస్తుతానికి ఈ సినిమాకు తమిళనాడు ఏరియాలో మంచి కలెక్షన్లు దక్కుతున్నాయి కానీ ఇతర ప్రాంతాల్లో మాత్రం భారీ స్థాయిలో కలెక్షన్లు దక్కడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: