బాలీవుడ్ టు టాలీవుడ్.. వెండితెర బంగారు తల్లులు..!!
ఆనాటి 'రోజులు మారాయి' సినిమా నుంచి నిన్నమొన్నటి 'సలార్’ వరకు అమ్మ పాత్రను అందలం ఎక్కించి.. వేడుక చేసుకున్న సినిమాలెన్నో ఉన్నాయి. ఆ తల్లి పాత్రల కోసమే పుట్టిన నటీమణులూ ఉన్నారు. సాధారణంగా 'నిన్నటి కథానాయికలు.. నేటి కథానాయకుల తల్లులు' అనే సంప్రదాయం ఇండస్ట్రీలో ఉంది. మహానటి సావిత్రి కూడా ఇందుకు మినహాయింపు కాదు. జమున, కృష్ణకుమారి, షావుకారు జానకి, అంజలీదేవి తదితర తొలితరం కథానాయికలు.. కృష్ణ, శోభన్‌బాబు సినిమాల్లో తల్లులుగా నటించి మెప్పించారు.రెండో తరంలో హీరోయిన్లుగా వెలుగొందిన శారద, వాణిశ్రీ, లక్ష్మి తదితర కథానాయికలు తర్వాతి జనరేషన్ నాయికానాయకులకు తల్లులయ్యారు. వీరిలో సెకండ్ ఇన్నింగ్‌లో వరుస విజయాలు సాధించిన
అమ్మ పాత్రధారి మాత్రం శారదే! కెరీర్ మొదటో ్ల పద్మనాభం, చలం లాంటి హాస్యనటుల పక్కన పెంకి పిల్లగా నటించిన శారద.. కథానాయికగా 'ఊర్వశి' అనిపించుకుంది.తెలుగు సినిమా ఈస్ట్‌మన్ కలర్ నుంచి పూర్తి రంగులు సంతరించుకునే వేళకు పూర్తిస్థాయి అమ్మగా అవతారమెత్తింది. ఎనభై, తొంభైల్లో తిరుగులేని మాతృమూర్తిగా ఇండస్ట్రీకి రక్షగా నిలిచింది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ లాంటి అగ్రహీరోల సినిమాల్లో తల్లిగా తన మార్కు నటన కనబరిచింది. 'అమ్మ రాజీనామా!' చిత్రం సంచలన విజయానికి కారణం శారద పాత్రే! 'అడవిదొంగ', 'కొండవీటి దొంగ', 'మదర్ ఇండియా', 'జగన్నాటకం' తదితర చిత్రాలు శారదలోని అమ్మదనాన్ని చిక్కగా చూపించాయి. ప్రభాస్ హీరోగా నటించిన 'యోగి' కలెక్షన్ల పరంగా విఫలమైనా.. శారద పాత్ర కలకాలం గుర్తుండిపోతుంది.1980ల్లో నటి అన్నపూర్ణ రూపంలో తెలుగు వెండితెరకు నిండైన అమ్మ అండ దొరికింది. సినిమా సినిమాకు నాయికా నాయకులు మారినా, దర్శకులు మారినా.. అమ్మ పాత్రలో మాత్రం అన్నపూర్ణే దర్శనమిచ్చేది. సగటు ప్రేక్షకుడు ఆమెలో సొంత తల్లిని చూసుకునేంతగా జీవించేది. హీరోయిన్గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అన్నపూర్ణ ఒకట్రెండు సినిమాల తర్వాత వదిన, అక్క, అమ్మ పాత్రలకు షిఫ్ట్ అయింది. 'ముందడుగు' సినిమాలో కృష్ణ తల్లిగా ఆమె నటించింది. కథలో చాలా బరువైన ఆ పాత్ర కోసం ముందుగా శారదను అనుకున్నారట. చివరికి ఆ అవకాశం అన్నపూర్ణకు దక్కింది. సినిమా విడుదలయ్యాక రెండు వారాలకు వెలసిన పోస్టర్లలో అన్నపూర్ణ నిలువెత్తు ఫొటో వేయడంతో ఆమె వెండితెర తల్లిగా ఫిక్సయింది. వందల సినిమాల్లో తల్లి పాత్ర వేసినా.. ప్రతిసారీ తన ప్రత్యేకతను నిరూపించుకుంది.
శారద, అన్నపూర్ణ తర్వాత ఆ స్థాయిలో స్థిరమైన సిల్వర్ స్క్రీన్ మదర్‌గా జయసుధ పేరు తెచ్చుకుంది. 'అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి' సినిమాలో సహజనటి తన మాతృత్వంతో ప్రేక్షకులకు మరింత చేరువైంది. 'బొమ్మరిల్లు'లో కొడుకు కోసం తపన పడే తల్లిగా ఆమె పెర్ఫార్మెన్స్కు జనమంతా జై కొట్టారు. జోవియల్ మదర్, సీరియస్ మదర్ ఇలా ఏ తరహా తల్లి పాత్రకైనా జయసుధ 'ద బెస్ట్’ అనిపించుకుంది. 'సీతమ్మ వాకిట్లో..', 'శతమానం భవతి' తరహా ఫ్యామిలీ బేస్డ్, సంప్రదాయ చిత్రాల్లో బరువైన అమ్మపాత్ర ఉంటే దర్శక నిర్మాతలు ముందుగా జయసుధనుసంప్రదిస్తుంటారు.పైన చెప్పుకొన్నట్టు.. వీరంతా అమ్మ పాత్రను బలంగా పండించి సినిమా భారాన్ని భుజానికెత్తుకున్న వాళ్లే! 'మదర్ ఇండియా', 'కడప రెడ్డమ్మ' సినిమాల్లో శారద పెర్ఫార్మెన్స్ కోసం రిపీటెడ్ ఆడియెన్స్ ఉండేవారు. 'అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి' సినిమాలో జయసుధ సీన్లు రిపీటెడ్‌గా చూసే అభిమానులు ఉన్నారు. 'సాగర సంగమం', 'సీతాకోకచిలుక' చిత్రాల్లో తల్లిగా డబ్బింగ్ జానకి ఎంత సహజంగా నటించిందో ఇప్పటికీ గుర్తుంటుంది. మొన్నటికి మొన్న బాహుబలిలో అమ్మదనానికి కొత్త నిర్వచనం ఇచ్చిన శివగామి పాత్రను ఎలా మర్చిపోగలం. ఆ పాత్ర, దాన్ని రమ్యకృష్ణ పండించిన తీరు రెండూ ఆ సినిమా విజయంలో ఎంతోకొంత పాత్ర పోషించాయని చెప్పక తప్పదు.ఇటీవల సలార్‌లో ఈశ్వరీరావు పోషించిన తల్లి పాత్ర.. ప్రభాస్ లాంటి స్టార్డమ్ ఉన్న నటుణ్ని ఎలివేట్ చేయడానికి పనికొచ్చిందంటే.. అమ్మకున్న పవర్ ఏంటో తెలుస్తుంది. ఎలాగైతే అమ్మ గురించి ఎంత చెప్పినా సరిపోదో… వెండితెర తల్లుల గురించి కూడా ఎంత చెప్పినా కొంత మిగిలే ఉంటుంది. మదర్ సెంట్రిక్‌గా వచ్చిన కథలు ఎప్పుడూ హిట్టే! అమ్మ పాత్రను హీరోచితంగా చూపించిన సినిమాలూ హిట్టే! దటీజ్ ద పవర్ ఆఫ్ మదర్.