ఉపాధి హామీ కూలీలకు గుడ్ న్యూస్..పని దినాలు పెంపు.. వేతనం కూడా..?
అధికారిక వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఉపాధి హామీ పథకం పేరు.. "పూజ్య బాపు గ్రామీణ రోజుగార్ యోజన " అన్నట్టుగా మార్చబడినట్లు వినిపిస్తున్నాయి. అలాగే పని దినాల సంఖ్య కూడా 100 రోజుల నుంచి 125 రోజుల వరకు ఉండేలా చూస్తున్నారు. కనీస వేతనం రోజుకి రూ. 240 రూపాయలకు సవరించారు. MNREGA లక్ష్యం గ్రామీణ ప్రాంతంలోని కుటుంబాల జీవనోపాధి భద్రతను పెంచడమే అన్నట్లుగా తెలియజేశారు. ఈ పథకాన్ని 2005లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ NREGA అనే పేరుతో ప్రారంభించారు.
ముఖ్యంగా వ్యవసాయం తక్కువగా ఉన్నటువంటి కాలంలో వారు ఈ జీవన ఉపాధి పథకం పైన ఆధారపడి జీవించవచ్చని.. కోట్లాదిమంది గ్రామీణ కార్మికులు ప్రయోజనం చేకూరుతుందని ఈ పథకాన్ని తీసుకువచ్చారు. గతంలో ప్రతి ఏడాది కనీసం 100 రోజుల పనికి అర్హతగా ఉండేది. ఇప్పుడు 125 కి పెంచారు.. ఈ పనులను గ్రామీణ రోడ్లు నిర్మించడం, చెరువులు తవ్వించడం ,నీటి సంరక్షణకు ,నీటిపారుదల కాలువలు సృష్టించడం ,ఇతర సమాజ అభివృద్ధి పనులకు కూడా ఉపయోగించుకునే విధంగా ఉపాధి హామీ పథకం ఉన్నది. గ్రామీణ కుటుంబాలకు మద్దతు ఇవ్వడం వల్ల నగరాలకు వలసలు వెళ్లకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది. అలాగే గ్రామ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి ఈ పథకం చాలా కీలకంగా వ్యవహరిస్తుంది.