అప్పుడే అదరగొడుతున్న తారక్ చిన్నోడు.. స్కిల్స్ చూస్తే షాక్.. భార్గవ్ రామ్ ట్యాలెంట్‌కు ఫిదా అవ్వాల్సిందే..!

Amruth kumar
టాలీవుడ్ 'మ్యాన్ ఆఫ్ మాసెస్' జూనియర్ ఎన్టీఆర్ కు ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన సినిమా వస్తుందంటే బాక్సాఫీస్ దగ్గర జాతరే. అయితే, ఇప్పుడు తారక్ కంటే ఆయన చిన్న కుమారుడు భార్గవ్ రామ్ సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతున్నాడు. తాజాగా భార్గవ్ రామ్ తనలోని చిత్రకళా నైపుణ్యాన్ని బయటపెట్టి, నందమూరి అభిమానులకు పూనకాలు తెప్పించాడు.సాధారణంగా ఎన్టీఆర్ తన వ్యక్తిగత జీవితాన్ని చాలా గోప్యంగా ఉంచుతారు. కానీ, అప్పుడప్పుడు ఆయన పిల్లలకు సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చి నెట్టింట రచ్చ చేస్తూ ఉంటాయి. తాజాగా హైదరాబాద్‌లోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో జరిగిన ఒక డ్రాయింగ్ పోటీలో భార్గవ్ రామ్ పాల్గొన్నాడు.



 ఈ పోటీలో భార్గవ్ రామ్ ఒక ఏనుగు (Elephant) చిత్రాన్ని గీసి, దానికి అద్భుతమైన రంగులు అద్దాడు. తను గీసిన పెయింటింగ్‌ను పట్టుకుని చిరునవ్వుతో ఉన్న భార్గవ్ ఫోటో ఇప్పుడు వైరల్‌గా మారింది."నటనే కాదు.. కళలోనూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు" అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ ఫోటోను ట్రెండ్ చేస్తున్నారు. చిన్న వయసులోనే అంత పర్ఫెక్ట్‌గా డ్రాయింగ్ వేయడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.



నందమూరి కుటుంబంలో నటన అనేది రక్తంలోనే ఉంది. అయితే, భార్గవ్ రామ్ మాత్రం చదువుతో పాటు ఇలాంటి ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో కూడా టాప్ లో ఉంటున్నాడు.కేవలం పెయింటింగ్ మాత్రమే కాదు, గతంలో భార్గవ్ రామ్ జిమ్నాస్టిక్స్ చేస్తున్న వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. అంటే ఫిజికల్ ఫిట్‌నెస్‌తో పాటు క్రియేటివిటీలోనూ తారక్ వారసుడు తగ్గేదే లే అంటున్నాడు.పెద్ద కొడుకు అభయ్ రామ్ కాస్త క్లాసీగా, సైలెంట్‌గా కనిపిస్తే.. భార్గవ్ రామ్ మాత్రం అచ్చం తండ్రిలాగే ఫుల్ ఎనర్జీతో, మాస్ వైబ్స్‌తో కనిపిస్తాడని ఫ్యాన్స్ అంటుంటారు.



ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమాతో బిజీ బిజీగా ఉంటున్నాడు.
. ఎంత బిజీగా ఉన్నా, తన పిల్లల ప్రతిభను ప్రోత్సహించడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు.పిల్లల స్కూల్ ఈవెంట్స్ ఉంటే షూటింగ్స్ పక్కన పెట్టి మరీ తారక్ హాజరవుతారు. ఈ పెయింటింగ్ కాంపిటీషన్ అప్పుడు కూడా ఆయన వెన్నంటే ఉండి కొడుకును ఎంకరేజ్ చేశారట.భార్గవ్ రామ్ డ్రాయింగ్ స్కిల్స్ చూస్తుంటే, నందమూరి అభిమానులకు ఒక విషయం అర్థమైపోయింది.. భవిష్యత్తులో ఈ చిన్నోడు వెండితెరపైనే కాదు, ఏ రంగంలోనైనా తన ముద్ర వేయడం ఖాయం.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: