అల్లు శిరీష్ వెడ్డింగ్ రిసెప్షన్లో అసలైన ఎంటర్టైనర్ ఎవరో తెలుసా?
నవీన్ పొలిశెట్టి మరియు అల్లు అర్జున్ ఒకరినొకరు ఆలింగనం చేసుకుని పలకరించుకోవడం చూడవచ్చు .వీరిద్దరి మధ్య ఉన్న బాండింగ్ చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.నవీన్ కేవలం పెద్దలతోనే కాదు, బుల్లి ఐకాన్ స్టార్ అల్లు అయాన్‌తో కూడా ఫుల్ కామెడీగా ముచ్చటించారు. అయాన్‌ను చూసి ఏదో జోక్ వేయడం, దానికి అయాన్ క్యూట్ గా రియాక్ట్ అవ్వడం వీడియోలో హైలైట్‌గా నిలిచింది.
ఈ వేడుకలో అల్లు అయాన్ లుక్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
రిసెప్షన్ వేదికపై అల్లు శిరీష్ తన భార్య నయనికతో కలిసి ఎంతో అందంగా కనిపించారు. నవీన్ పొలిశెట్టి స్టేజ్ పైకి వెళ్లి వారితో ఫోటోలు దిగడమే కాకుండా, వారిని సరదాగా ఆటపట్టించారు.అల్లు స్టూడియోస్ లో జరిగిన ఆ వేడుకలకు టాలీవుడ్ సినీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్లు ఇలా ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు సందడి చేశారు. ముఖ్యంగా అక్కినేని, నందమూరి, మెగా కుటుంబాలకు చెందిన సభ్యులు హాజరై వేడుకలకు మరింత స్పెషాలిటీ తీసుకొచ్చారు.
అల్లు అరవింద్ గారితో పాటు ఇతర మెగా ఫ్యామిలీ సభ్యులు వేడుకలో అతిథులను రిసీవ్ చేసుకుంటూ కనిపించారు. "నవీన్ పొలిశెట్టి ఎనర్జీ మామూలుగా లేదు" అని కొందరు, "అయాన్ ఈజ్ ఫ్యూచర్ ఐకాన్ స్టార్" అని మరికొందరు ఈ వీడియో కింద కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు.అల్లు శిరీష్ వెడ్డింగ్ రిసెప్షన్ కేవలం ఒక వేడుక కాదు.. ఇది టాలీవుడ్ స్టార్స్ అందరూ కలిసి జరుపుకున్న ఒక పెద్ద పండుగ. నవీన్ పొలిశెట్టి వంటి హీరోలు తమ సరదాతో ఈ వేడుకను మరింత కలర్ ఫుల్ గా మార్చేశారు.