సోషల్ మీడియాలో.. మెయిన్ మీడియాలో.. సినీ ఇండస్ట్రీలో ఎక్కడైనా సరే ఈ జ్యోతిష్యుడు పేరు చాలా ఫేమస్.ఆయనే వేణు స్వామి.. టాలీవుడ్ సహా ఎంతోమంది సినీ తారల,రాజకీయ నాయకుల భవిష్యత్తులు చెబుతూ వారికి త్వరలో జరగబోయేది ఇదే..వారు ఇలాంటి సంఘటనలు ఎదుర్కొంటారు.. అంటూ ముందే భవిష్యత్ ఊహించి చెప్పేవారు. అంతేకాకుండా కొంతమంది సెలబ్రిటీల సినీ కెరియర్, పెళ్లి,విడాకులు ఇలా పర్సనల్ లైఫ్ గురించి కూడా చెప్పి సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచారు. ముఖ్యంగా ఈయన టాలీవుడ్ సెలబ్రిటీలకు సంబంధించి చెప్పిన పర్సనల్ లైఫ్ విషయాలు కొన్ని చెప్పినవి చెప్పినట్టు జరగడంతో ఈయన ఆస్ట్రాలజీ చాలా ఫేమస్ అయిపోయింది.అయితే అలాంటి వేణు స్వామి ఒక్కసారిగా బొక్క బోర్లా పడ్డారు.
అదే తెలంగాణలో మళ్లీ కేసిఆర్ సీఎం అవుతాడు.. ఆంధ్రలో మళ్లీ జగన్ సీఎం అవుతారు..ఈ విషయంలో వేణు స్వామి బొక్క బోర్లా పడి మళ్లీ ఇంకొకసారి సెలబ్రిటీల జ్యోతిష్యం అంటూ ముందుకు రాను అని మీడియా ముందు సారీ చెప్పారు. కానీ ఆ తర్వాత మళ్లీ శోభిత, నాగచైతన్య ఎంగేజ్మెంట్ రోజు తన గోల మొదలుపెట్టారు.అయితే ఈ విషయంలో వేణు స్వామి పై కోర్టులో కేసు వేయడంతో కాస్త వెనక్కి తగ్గారు. ఇదిలా ఉంటే తాజాగా వేణు స్వామి మళ్ళీ తన గోల మొదలుపెట్టేశారు. అదేంటంటే.. రీసెంట్ గా నటి ప్రగతి ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2025లో 4 పథకాలు గెలుచుకున్న సంగతి మనకు తెలిసిందే.అలా 50 ప్లస్ లో దేశానికి పథకాలు తెచ్చి ప్రగతి ఎంతోమందికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తుంది.
అయితే అలాంటి ప్రగతికి మెడల్స్ నా వల్లే వచ్చాయి అంటూ వేణు స్వామి తాజాగా ఓ షాకింగ్ విషయాన్ని బయట పెట్టారు. వేణు స్వామి ప్రగతి మెడల్స్ గురించి మాట్లాడుతూ.. ప్రగతి వెయిట్ లిఫ్టింగ్ లో గెలవాలని నా వద్దకు వచ్చి పూజలు చేయించుకుంది.నా పూజల ప్రతిఫలమే ఆమె కి మెడల్స్ రూపంలో వచ్చాయి. నా పూజ కారణంగానే ప్రగతికి మెడల్స్ వచ్చాయి. అద్భుతమైన ప్రతిభ కనబరిచి ప్రగతి మెడల్స్ గెల్చుకుంది. ఇదంతా నా పూజల వల్లే అంటూ వేణు స్వామి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వేణు స్వామి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది నెటిజన్స్ మళ్లీ మొదలు పెట్టావా అయ్యా.. నీకు ఏమీ పని లేదా..ఎప్పుడు ఏదో ఒక సోది చెబుతూనే ఉంటావా అంటూ మండిపడుతున్నారు.