నందమూరి నటన సింహం బాలకృష్ణ తాజాగా అఖండ 2 అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమణి సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించగా ... టాలీవుడ్ మాస్ దర్శకులలో ఒకరు అయినటువంటి బోయపాటి శ్రీను ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను డిసెంబర్ 12 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదల చేశారు. ఈ మూవీ కి సంబంధించిన ప్రీమియర్ షో లను డిసెంబర్ 11 వ తేదీన రాత్రి నుండి పెద్ద ఎత్తున ప్రదర్శించారు. ఈ మూవీ ప్రీమియర్ షో లకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇక ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు కూడా అద్భుతమైన ఓపెనింగ్లు లభించాయి. ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్ల విషయంలో ఏకంగా బాహుబలి పార్ట్ 1 మూవీ ని naizam ఏరియాలో దాటేసింది. అసలు విషయం లోకి వెళితే ... మొదటి రోజు నైజాం ఏరియాలో బాహుబలి పార్ట్ 1 మూవీ కి 6.32 కోట్ల కలెక్షన్లు దక్కాయి.
ఇక మొదటి రోజు నాని హీరో గా రూపొందిన దసరా మూవీ కి నైజాం ఏరియాలో 6.78 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఇక తాజాగా బాలకృష్ణ హీరో గా రూపొందిన అఖండ 2 మూవీ కి నైజాం ఏరియాలో మొదటి రోజు 7.05 కోట్ల కలెక్షన్లు దక్కాయి. దానితో ఈ సినిమా మొదటి రోజు నైజాం ఏరియాలో అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టు లో బాహుబలి 1 , దసరా సినిమాల కలెక్షన్లను దాటేసి అద్భుతమైన స్థాయిలో నిలిచింది. ఇక ఈ మూవీ కి మిక్స్ డ్ టాక్ వచ్చింది. అయిన కూడా ఈ మూవీ కి మంచి కలెక్షన్లు ప్రస్తుతం దక్కుతున్నాయి. మరి లాంగ్ రన్ లో ఈ సినిమా ఎలాంటి కలెక్షన్లను వసూలు చేసి ఏ రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంటుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.