తిరుమల దర్శనం వివాదంపై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..!

Divya
తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు నిత్యం కోట్లాదిమంది భక్తులు వెళ్తూ ఉంటారు. అయితే రెండు సెకండ్ల దర్శన భాగ్యం కోసం ప్రపంచ దేశాల నుంచి కూడా వెంకటేశ్వర స్వామి భక్తులు క్యూలైన్లో గంటల తరబడి నిలబడి దేవుడు దర్శనం చేసుకుంటారు. అయితే ఇటీవలే టాలీవుడ్ హీరోయిన్ శివాని నాగారం తిరుమల దర్శనం పైన చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శివాని తాను తిరుమలలో శ్రీవారి దర్శనంలో దాదాపుగా 15 నిమిషాల పాటు దర్శనం చేసుకున్నానంటు తెలిపింది.



చిన్నప్పుడు తిరుపతికి వెళ్లే దాన్ని మళ్లీ 13 ఏళ్ల తర్వాత తిరుమలకు వెళ్లాలనిపించింది. శ్రీవారి దర్శనం టికెట్ ద్వారా లైన్లో నిలబడి గర్భగుడి వరకు స్వామివారిని దర్శించుకునే అవకాశం లభించిందని తెలిపింది. అయితే ఈ వ్యాఖ్యలు భక్తులకు సైతం తప్పుగా అర్థమైయ్యి.. సెలబ్రిటీలకు ఇంతటి ప్రాధాన్యం ఎందుకు? అంటూ విమర్శలు వచ్చాయి. అయితే ఈ విషయం పైన శివాని నాగారం క్లారిటీ ఇస్తూ ఒక వీడియోని విడుదల చేసింది.



 ఈ వీడియోలో ఆమె మాట్లాడుతూ అందరికీ నమస్కారం తాను ఒక యూట్యూబ్ ఛానల్లో నేను స్పిరిచువల్ జర్నీ షేర్ చేసుకున్నాను అందులో తిరుపతి గురించి నేను మాట్లాడడం జరిగింది. అయితే 15 నిమిషాల పాటు దర్శనం చేసుకున్నానని చెప్పడం కొంచెం హైలెట్ అవుతోంది. దానిపైన క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో చేస్తున్నానని.. 2025 అక్టోబర్ లో రూ. 10,500 రూపాయలు కట్టి మరి శ్రీవారి దర్శనం టికెట్లు తీసుకొని తాను తల్లితో కలిసి లైన్లో నిల్చొని తీసుకొని ఆ తర్వాత లైన్లో నిలుచున్నప్పుడు కొంచెం కొంచెం స్వామి వారు కనిపిస్తూ ఉంటారు. నేను ఆ సమయంలోనే అంచనా వేసి మొత్తం 15 నిమిషాల పాటు స్వామి వారి దర్శనం చేసుకున్నానని చెప్పాను.. కానీ తాను చెప్పిన వ్యాఖ్యలు కొంతమంది మిస్లిడ్ చేస్తున్నారు అంటూ వీడియోతో క్లారిటీ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: