త్రివిక్రమ్, తారక్.. కంటెంట్ క్లిక్ అయితే బాక్సాఫీస్‌కు భూకంపమే!

Amruth kumar
టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లు కేవలం సినిమాలు మాత్రమే కాదు, అవి సెన్సేషన్లు. అలాంటి ఒక క్రేజీ కాంబోనే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. 'అరవింద సమేత వీర రాఘవ' వంటి క్లాసిక్ హిట్ తర్వాత, మళ్లీ వీరిద్దరు జతకట్టబోతున్నారనే వార్త విన్నప్పటి నుంచే టాలీవుడ్ షేక్ అవుతోంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి వినిపిస్తున్న తాజా అప్‌డేట్స్ చూస్తుంటే, ఇది కేవలం మామూలు యాక్షన్ సినిమా కాదు, ఒక గ్లోబల్ విజువల్ వండర్ అని అర్థమవుతోంది.

మే 20న తారక్ పుట్టినరోజు రాబోతుండటంతో, సోషల్ మీడియా వేదికగా అభిమానుల సందడి అప్పుడే మొదలైపోయింది. ఈ పుట్టినరోజు సందర్భంగా త్రివిక్రమ్ - ఎన్టీఆర్ సినిమా నుండి ఒక పవర్‌ఫుల్ అప్‌డేట్ రాబోతోందనే వార్త ఇప్పుడు అభిమానుల్లో ఊపిరి పోస్తోంది.గత కొద్ది రోజులుగా ఈ సినిమాకు 'గాడ్ ఆఫ్ వార్' (God of War) అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. టైటిల్ వింటుంటేనే ఇది ఒక భారీ యుద్ధ నేపథ్యంలో సాగే కథ అని స్పష్టమవుతోంది. అయితే, దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు.

మే 20న తారక్ బర్త్ డే కానుకగా ఒక ప్రత్యేకమైన అనౌన్స్‌మెంట్ వీడియోను విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట.ఈ వీడియోను త్రివిక్రమ్ చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారట. హై ఎండ్ విజువల్ ఎఫెక్ట్స్ (VFX), గూస్‌బంప్స్ తెప్పించే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, మరియు ఎన్టీఆర్ లుక్ లేదా సినిమా కాన్సెప్ట్‌కు సంబంధించిన ఒక చిన్న హింట్‌ను ఈ వీడియోలో చూపించే అవకాశం ఉంది. ఈ అప్‌డేట్ కోసం నందమూరి అభిమానులు వేల కళ్లతో ఎదురుచూస్తున్నారు.త్రివిక్రమ్ సినిమాల్లో ఎప్పుడూ ఒక అంతర్లీనమైన భక్తి భావం లేదా పురాణాల ఛాయలు కనిపిస్తాయి. 'అత్తారింటికి దారేది'లో అంపశయ్య ప్రస్తావన నుంచి 'అరవింద సమేత'లో యుద్ధం ముగింపు వరకు ఆయన ప్రతి విషయాన్ని పురాణాలతో ముడిపెడతారు. అయితే, ఈసారి ఏకంగా మైథలాజికల్ జానర్‌నే టచ్ చేస్తున్నట్లు టాక్.

ఈ సినిమా కుమారస్వామి (Lord Murugan) నేపథ్యంతో ఉండొచ్చనే వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. కుమారస్వామి అంటేనే దేవతల సేనాధిపతి, యుద్ధ వీరుడు. అలాంటి పవర్‌ఫుల్ క్యారెక్టరైజేషన్ ఉన్న పాత్రలో తారక్ కనిపిస్తే.. ఇక థియేటర్లలో పూనకాలు రావడం ఖాయం. త్రివిక్రమ్ మార్క్ సంభాషణలు, ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీ కలిస్తే అది ఒక విజువల్ పోయెట్రీలా ఉంటుంది.ఎన్టీఆర్ ఏ పాత్ర చేసినా అందులో పరకాయ ప్రవేశం చేస్తారు. ఇక దేవతా శక్తులు ఉన్న పాత్రలో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ఊహించుకుంటేనే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. త్రివిక్రమ్ తనదైన శైలిలో ఎమోషన్స్ మరియు ఫిలాసఫీని ఈ సినిమాలో భారీ యాక్షన్ తో మేళవించబోతున్నారట. ప్రస్తుతం త్రివిక్రమ్ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి, విజువల్స్ ఎలా ఉండాలి అనే దానిపై ఆర్ట్ డైరెక్టర్లు మరియు విఎఫ్ఎక్స్ టీమ్ తో చర్చిస్తున్నట్టు సమాచారం.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులను వేటాడటం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ కి ఉన్న గ్లోబల్ ఇమేజ్ దృష్ట్యా ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: