కరోనాను మించిన మరో వైరస్ రాబోతోందా..?

Divya
ప్రస్తుతం ప్రపంచ దేశాలను భయభ్రాంతులకు గురిచేస్తోంది హంతా వైరస్. ఒక డచ్ క్రూయిజ్ లో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు సైతం ఈ వైరస్ బారిన పడి మరణించడంతో ఒక్కసారిగా ఈ విషయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ క్రూయిజ్ లో 23 దేశాలకు సంబంధించి దాదాపుగా 150 మంది ప్రయాణికులు ఉండడం వల్లే ఈ వైరస్ ఇప్పుడు అంతర్జాతీయంగా విస్తరించే అవకాశాలు ఉన్నట్లు వినిపిస్తున్నాయి. మరి ఈ హంతా వైరస్ అంటే ఏమిటి? దీనివల్ల ఇండియాకి ఏదైనా ముప్పు ఉందా అనే విషయం గురించి ఇప్పుడు ఒకసారి చూద్దాం.



ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలుపుతున్న ప్రకారం.. హంతా వైరస్ అనేది హంటావీరిడే కుటుంబానికి చెందిన వైరస్ అని ,ఇది ఎక్కువగా ఎలుకలు చిట్టెలుకల ద్వారా వ్యాప్తి చెందుతుందని తెలియజేశారు. ఈ ఎలుకలు మూత్రం, లాలాజలం, మలం వంటి వాటిని తాకినప్పుడు ఇది ఇన్ఫెక్షన్ గా మారినప్పుడు హంతా వైరస్ ఏర్పడుతుందని, ఇది నేరుగా ఊపిరితిత్తులు గుండె పైన చాలా ప్రభావం చూపిస్తుందని అందుకే దీన్ని అత్యంత ప్రమాదకరమైన వైరస్లలో ఒకటని చెబుతున్నారు. 23 దేశాలకు చెందిన 149 మంది ప్రయాణికులు ఉన్న ఈ షిప్ లో స్పెయిన్, బ్రెజిల్, అంగోలా వంటి దేశాల తీరాల మీదుగా ప్రయాణించిందట.


ఆ సమయంలోనే ఈ వైరస్ వల్ల ముగ్గురు మరణించడం తీవ్ర ఆందోళనకు దారితీసిందని మిగిలిన ప్రయాణికులకు కూడా ఈ వైరస్ సోకిందేమో అనే అనుమానాలతో పర్యవేక్షణ పెంచేశారు. హంతా వైరస్ శరీరంలోకి ప్రవేశించిన ఒకటి నుంచి 8 వారాల తరువాతే దీని యొక్క లక్షణాలు బయటపడతాయి. మొదట ఇది జ్వరంలాగే వచ్చిన ,తీవ్రమైన తలనొప్పి ,కండరాల నొప్పులు, వాంతులు, కడుపునొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం వంటివి కనిపిస్తాయి. అయితే ఈ వైరస్ పట్ల భారతీయులు మాత్రం ప్రస్తుతం భయపడాల్సిన పని లేదంటూ ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఆ క్రూయిజ్ షిప్ ప్రయాణించిన మార్గానికి ఇండియాకి ఎటువంటి సంబంధం లేదని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: