భూగర్భంలో కుస్తీ సెటప్.. చరణ్ ‘పెద్ది’ సెట్స్ నెక్స్ట్ లెవల్!

Amruth kumar
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ (Peddi). ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో అందరికీ తెలిసిందే. కేవలం చరణ్ హీరో కావడమే కాకుండా, ‘ఉప్పెన’ లాంటి క్లాసిక్ హిట్ తర్వాత బుచ్చిబాబు చేస్తున్న సినిమా కావడం, ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ మీద పాన్ ఇండియా లెవల్లో క్యూరియాసిటీ నెలకొంది. అయితే, తాజాగా ఈ సినిమా ప్రొడక్షన్ డిజైన్ గురించి బయటకు వచ్చిన విషయాలు సినీ ప్రియులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

ఆ కాలం నాటి విజయనగరం..

1970, 80వ దశకం నాటి పీరియాడిక్ కథాంశంతో ‘పెద్ది’ సినిమా రూపొందుతోంది. ఆ కాలం నాటి వాతావరణాన్ని, సంస్కృతిని వెండితెరపై అత్యంత సహజంగా ఆవిష్కరించడం కోసం చిత్ర బృందం భారీ సాహసమే చేసింది. ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా నేతృత్వంలోని టీమ్ ఏకంగా ఆ కాలం నాటి విజయనగరం పట్టణాన్నే సెట్స్ రూపంలో సృష్టించారు. కథలోని తీవ్రతను, గ్రాండియర్‌ను ప్రతిబింబించేలా ఏకంగా 24 భారీ సెట్లు నిర్మించారు.ఇవి కాకుండా మరో 60 నుండి 70 వరకు చిన్నపాటి సెటప్స్‌ను ఏర్పాటు చేయడం విశేషం. రామ్ చరణ్ లాంటి గ్లోబల్ స్టార్ పబ్లిక్ లో షూటింగ్ చేయడం అంటే భద్రతా పరమైన సమస్యలు ఎదురవుతాయి. అందుకే, ఆర్టిస్టులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ఏ కాలంలోనైనా (ఎండ, వాన) షూటింగ్ నిరాటంకంగా సాగేలా ఏడాదంతా కష్టపడి ఈ భారీ విజయనగరం సెట్‌ను సిద్ధం చేశారు.

ప్రేక్షకులు థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు అది సెట్ అని ఏమాత్రం అనిపించకూడదనేది అవినాష్ కొల్లా లక్ష్యం. అందుకే విజయనగరం వీధులు, అక్కడి పురాతన కట్టడాలు, ప్రసిద్ధ క్లాక్ టవర్ వంటి ప్రతి చిన్న డీటెయిల్‌ను ఎంతో నిశితంగా పరిశీలించి మరీ డిజైన్ చేశారు. స్క్రీన్ మీద విజయనగరం వాతావరణం అంత న్యాచురల్ గా కనిపిస్తుందని చిత్ర యూనిట్ ధీమాగా చెబుతోంది.

భూగర్భంలో భారీ కుస్తీ సెటప్

ఈ కథలో క్రీడలకు, ముఖ్యంగా క్రికెట్ మరియు కుస్తీ (Wrestling)కి చాలా ప్రాధాన్యత ఉందని సమాచారం. ఈ క్రమంలో ఎవరూ ఊహించని విధంగా ఒక అండర్ గ్రౌండ్ (భూగర్భ) కుస్తీ సెటప్ వేశారు.పవర్ ఫుల్ షాట్: గద పట్టుకుని రామ్ చరణ్ వీరోచితంగా కనిపించే ఒక పవర్ ఫుల్ షాట్ ను ఈ అండర్ గ్రౌండ్ సెట్ లోనే చిత్రీకరించారు. ఈ ఎపిసోడ్ సినిమా మొత్తానికి ఒక ఎమోషనల్ అండ్ మాస్ హైలైట్ గా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: