టాలీవుడ్ ఇండస్ట్రీ లో దర్శకుడిగా , నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో సందీప్ రాజ్ ఒకరు. ఈయన కొన్ని సంవత్సరాల క్రితం సుహాస్ హీరో గా చాందిని చౌదరి హీరోయిన్గా కలర్ ఫోటో అనే సినిమాను రూపొందించాడు. ఈ సినిమాలో సునీల్ విలన్ పాత్రలో నటించాడు. ఈ మూవీ థియేటర్లలో కాకుండా నేరుగా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో విడుదల అయింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు వచ్చాయి. దానితో ఈ సినిమా ద్వారా దర్శకుడుగా సందీప్ రాజ్ కి మంచి గుర్తింపు వచ్చింది. కలర్ ఫొటో సినిమా ద్వారా మంచి గుర్తింపు వచ్చిన ఈయన ఆ తర్వాత దర్శకుడిగా నెక్స్ట్ మూవీ ని ఓకే చేసుకోవడానికి చాలా కష్టాలు పడ్డాడు.
తాజాగా ఈయన రోషన్ కనకాల హీరో గా రూపొందిన మోగ్లీ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఈ రోజు అనగా డిసెంబర్ 13 వ తేదీన థియేటర్లో విడుదల అయింది. తాజాగా సందీప్ రాజ్ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. అందులో భాగంగా సందీప్ రాజ్ కలర్ ఫోటో సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేశాడు. తాజాగా సందీప్ రాజు ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ ... కలర్ ఫోటో సినిమాలో విలన్ క్యారెక్టర్ మొదట నేనే చేయాలి అనుకున్నాను. ఆ పాత్ర చేయడం కోసం ఫిట్ గా అయ్యే ప్రక్రియలో నేను చాలా కష్ట పడ్డాను. దానితో నాకు పానిక్ అటాక్ కూడా వచ్చింది. దానితో నేను ఆ పాత్రలో సునీల్ గారిని తీసుకోవాలి అనుకున్నాను. సునీల్ గారు ఆ సినిమాలో విలన్ పాత్ర చేయడానికి ఓకే చెప్పాక ఆ సినిమా క్రేజ్ మరింతగా పెరిగిపోయింది అని సందీప్ రాజ్ తాజా ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పుకొచ్చాడు.