యుఫోరియా మూవీ రివ్యూ.. గుణశేఖర్ కు సక్సెస్ అందించిందా..?

Divya
స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో, భూమిక, సారా అర్జున్, విగ్నేష్ గవిరెడ్డి, రోహిత్,గౌతమ్ మీనన్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం యుఫోరియా. ఈ చిత్రం ఫిబ్రవరి 6న విడుదల అయింది. ఒక్కరోజు ముందే ఈ సినిమాకి సంబంధించి ప్రీమియర్ షో కూడా పడ్డాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డైరెక్టర్ గుణశేఖర్ కి ఏ విధమైన సక్సెస్ ఇచ్చిందొ ఇప్పుడు ఒకసారి చూద్దాం .


స్టోరీ:
ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న యువతరాన్ని దృష్టిలో పెట్టుకొని యుఫోరియా చిత్రాన్ని తెరకెక్కించారు. చైత్ర (సారా అర్జున్) ఒక పెద్దింటి అమ్మాయిగా చదువులో టాపర్ , ఐఏఎస్ కావాలని పట్టుదలతో పరీక్షలకు సిద్ధమవుతుంటుంది. కానీ ఒకరోజు తన స్నేహితులు ఒక పబ్ పార్టీకి పిలవడంతో తల్లిదండ్రులు అనుమతితోనే ఆ పార్టీకి వెళ్తుంది. అయితే అక్కడ వికాశ్ (విగ్నేష్ గవిరెడ్డి)తో అతని స్నేహితులకు కూడా పరిచయం అవుతుంది చైత్ర . చైత్ర అందానికి ఫిదా అయిన వికాశ్ ఆమె పైన కన్నేస్తాడు. అలా తిరిగి ఇంటికి వెళుతున్న సమయంలో కారులో తీసుకెళ్లి రేప్ చేస్తారు. దీంతో ఈ విషయంపై చైత్ర ఇంట్లో చెప్పగా వారు పోలీస్ కంప్లైంట్ చేస్తారు. అలా చైత్ర చెప్పిన ఆధారలతో జయదేవ్ (గౌతమ్ మీనన్) అతని టీమ్ పారిపోయిన వికాశ్ అతని స్నేహితులను పట్టుకుంటారు. అయితే వారంతా కూడా మైనర్ కావడం, వాళ్ల పేర్లు చెప్పకుండా, పేరెంట్స్ పలుకుబడి ఉన్నవాళ్లు కావడంతో మీడియా ముందు వారి పేర్లు బయటపెట్టి ఒక సంచలనం సృష్టిస్తారు జయదేవ్. అందులో వికాస్ తల్లి వింధ్య (భూమిక) , తండ్రి (రోహిత్) పేర్లు కూడా బయట పెట్టడంతో, వింధ్య స్కూల్ ప్రిన్సిపల్ కావడం చేత తన కొడుకు రేపిస్ట్ అని విమర్శలు కూడా వినిపిస్తాయి. దీంతో వికాస్ అతని స్నేహితుల పైన ఫోక్స్ కేస్ పెట్టగా, వింధ్య కుటుంబం తన కొడుకుని ఎలా బయటకు తీసుకురావాలని చూస్తూ ఉంటారు. కానీ వింధ్య మాత్రం తన కొడుకు శిక్ష పడాలని చూస్తుంది?. మరి వికాస్ , అతని స్నేహితులకి చైత్ర ఎలా శిక్ష వేయిస్తుంది? జయదేవ్ ఈ కేస్ ని ఎలా డీల్ చేశారనే విషయం తెలియాలి అంటే వెండితెర పైన చూడాల్సిందే.


సినిమా ఎలా ఉందంటే:
యువతరం మాదకద్రవ్యాలకు అలవాటు పడితే ఏం జరుగుతుందనే విషయాన్ని చాలా అద్భుతంగా చూపించారు డైరెక్టర్ గుణశేఖర్. అలాగే రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనగా మారిన జూబ్లీహిల్స్ పబ్ హత్యాచార సంఘటన స్ఫూర్తి ఆధారంగానే ఈ సినిమా కథను తీసుకున్నట్లు అర్థమవుతుంది. ఈ సినిమాలో ప్రతి ఒక్క సీన్ కూడా ఆసక్తి కలిగించేలా చేస్తుంది. ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ మొదలైన తర్వాత కమిషనర్ జయదేవ్ వ్యవహరించే తీరు అందరిని ఆకట్టుకుంటుంది. అత్యాచార కేసులో సాక్షాలను సేకరించే విధానం కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. కొన్ని సన్నివేశాలు మాత్రం మనసుకు ఇబ్బందికరంగా కూడా అనిపిస్తాయి. అలాగే అత్యాచార కేసులో జీవిత ఖైదీగా పడిన వికాశ్, అతని గ్యాంగ్ జైల్లో ఎదుర్కొన్న అనుభవాలేంటి? కొడుకు చేసిన తప్పు వల్ల తల్లిగా భూమిక సమాజం నుంచి ఎలాంటి అవమానాలు ఎదుర్కొంది అనే పాత్రలో చాలా అద్భుతంగా నటించింది.

నటీనటుల నటన:
చైత్ర పాత్రలో సారా అర్జున్ అద్భుతంగా నటించింది. ఇందులో బాధితురాలి పాత్రలో నటన చూసి మనసుల్ని కదిలిస్తాయి. తప్పు చేసింది కొడుకాయినా సరే శిక్షపడాల్సిందే అని తల్లిగా వింధ్య పాత్రలో భూమిక జీవించేసింది. పోలీస్ కమిషనర్ గా జయదేవ్ పాత్రలో గౌతమ్ మీనన్ అద్భుతంగా నటించారు. అలాగే వికాస్ పాత్రలో విగ్నేష్ నటన కూడా ఆకట్టుకుంటుంది. ఇలా ఎవరికి వారు ఈ సినిమాలోని పాత్రలో అద్భుతంగా నటించారు.


సినిమా బలాలు:
భూమిక, గౌతమ్ మినన్ నటన
యువతను ఆలోచింపజేసే కొన్ని అంశాలు
సారా అర్జున్ యాక్టింగ్


బలహీనతలు:
అందరికీ తెలిసిన కథ
ఎమోషనల్ గా లేని కొన్ని సన్నివేశాలు.

చాలాకాలం తర్వాత గుణశేఖర్ ఒక మంచి సినిమా తీశారని చెప్పవచ్చు.

రేటింగ్:
2.8/5

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: