కుకింగ్ రాకపోయినా రూమ్ లో ఉండాలనుకుంటున్నారా.. ఇలా చేస్తే చాలు!
వంట చేయడం అస్సలు రాకపోయినా, ప్రతిరోజూ బయట హోటల్ తిండి మీద ఆధారపడకుండా రూమ్‌లో హాయిగా గడిపేయడం ఇప్పుడు చాలా సులభం. అసలు గరిటె తిప్పడం కూడా తెలియని వారు కొన్ని చిన్న స్మార్ట్ ప్లాన్స్ చేసుకుంటే చాలు. వంట రాని వారికి వరంలాంటిది ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్. కేవలం అన్నం వండటానికే కాకుండా, ఇందులో మ్యాగీ, పాస్తా వంటివి చేసుకోవచ్చు, అలాగే కూరగాయలను ఉడకబెట్టుకోవచ్చు. బ్యాచిలర్ రూమ్‌లో ఇది ఉంటే సగం సమస్యలు తీరినట్టే.
మార్కెట్లో ఇప్పుడు 'రెడీ టు ఈట్' ప్యాకెట్లు విరివిగా దొరుకుతున్నాయి. కేవలం వేడి నీళ్లలో ఉంచితే సరిపోయే పులిహోర, ఉప్మా, పొంగల్, పప్పు వంటివి తెచ్చి పెట్టుకుంటే అత్యవసర సమయాల్లో ఆకలి తీరుస్తాయి. వీటితో పాటు బ్రెడ్, పీనట్ బటర్, జామ్ వంటివి ఎప్పుడూ అందుబాటులో ఉంచుకోవడం మంచిది. స్టవ్ వెలిగించాల్సిన అవసరం లేకుండానే ఇవి తక్షణమే కడుపు నింపుతాయి. ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చేవారు మొలకెత్తిన గింజలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ అలవాటు చేసుకుంటే వంటతో పని లేకుండానే పోషకాలను పొందవచ్చు.
ముఖ్యంగా స్నేహితుల సాయంతోనో లేదా ఇంటి నుంచో వారానికి ఒకసారి సరిపోయేలా కొన్ని రకాల పచ్చళ్లు, కారప్పొడులు తెచ్చుకోవడం ఉత్తమం. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి, ఈ పొడులు వేసుకుంటే హోటల్ భోజనం కంటే రుచిగా ఉంటుంది. ఇక పెరుగును ఎప్పుడూ అందుబాటులో ఉంచుకుంటే వంట గందరగోళం లేకుండా సింపుల్‌గా భోజనం ముగించేయొచ్చు. కాబట్టి వంట రాదని ఆందోళన చెందకుండా, ఇలాంటి చిట్కాలతో బ్యాచిలర్ లైఫ్‌ను చాలా ఈజీగా మేనేజ్ చేయవచ్చు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి. రెండు రాష్ట్రాల్లో నియోజకవర్గాల వారీగా సమస్యలు, ఎమ్మెల్యేల పనితీరు, వారు ఇచ్చిన హామీలు, ప్రజల ఇబ్బందులు, అక్కడ అధికార, ప్రతిపక్ష పార్టీల పరిస్థితులు, రాజకీయ అంశాలపై కూడా మీ అభిప్రాయం మాతో పంచుకోండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.