తండ్రికి కాదు, త్రిషకి కాదు..ఆ స్ధానం అతడికే..ఊహించని షాక్ ఇవ్వబోతున్న విజయ్..!?

Thota Jaya Madhuri
టీవీకే పార్టీ అధినేత విజయ్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో చెన్నై నగరంలోని పెరంబూర్ మరియు తిరుచిరాపల్లి ఈస్ట్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి, రెండింటిలోనూ ఘన విజయాన్ని సాధించారు. రెండు చోట్ల గెలవడంతో, రాజ్యాంగ ప్రకారం ఆయన ఒక నియోజకవర్గాన్ని తప్పనిసరిగా వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆయన ఏ స్థానాన్ని వదులుకుంటారు? ఆ సీటు ఎవరికి దక్కుతుంది? అనే ప్రశ్నలపై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ సాగుతోంది. ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం విజయ్ పెరంబూర్ స్థానాన్ని వదులుకునే అవకాశం ఎక్కువగా ఉందని తెలుస్తోంది. అయితే ఆ స్థానాన్ని ఎవరికీ కేటాయిస్తారు అన్నదే అసలు ఆసక్తికర అంశం. మొదట్లో ఈ సీటును ప్రముఖ నటి త్రిషకు ఇస్తారని ప్రచారం జోరుగా సాగింది. కానీ తాజా రాజకీయ సమీకరణాల ప్రకారం టీవీకే పార్టీ కార్యదర్శి బుస్సీ ఆనంద్‌కు ఈ అవకాశం ఇవ్వవచ్చని సమాచారం వినిపిస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఇక త్రిష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారని చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న కొన్ని సినిమాలను పూర్తిచేసి, తర్వాత పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టి పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఒక ఇంటర్వ్యూలో తాను భవిష్యత్తులో తమిళనాడు ముఖ్యమంత్రి కావాలని ఆశపడుతున్నట్లు కూడా ఆమె వెల్లడించారు. ఈ వ్యాఖ్యలతో ఆమె రాజకీయ ప్రవేశంపై మరింత చర్చ మొదలైంది.ఇలాంటి పరిస్థితుల్లో, టీవీకేలో అనధికారికంగా ప్రభావం చూపుతున్న త్రిష త్వరలోనే పార్టీకి అధికారికంగా చేరవచ్చని, ఆ తరువాత పెరంబూర్ ఉపఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని కొంతమంది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఆమె ఎమ్మెల్యేగా గెలిచి, తమిళనాడు అసెంబ్లీలో అడుగుపెడతారని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే ఇవన్నీ ఇప్పటికీ ఊహాగానాలే గానీ, స్పష్టమైన సమాచారం మాత్రం లేదు. మొత్తానికి, విజయ్ తీసుకునే తుది నిర్ణయం ఏదైనా, అది తమిళనాడు రాజకీయాల్లో కొత్త మార్పులకు దారి తీసే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పెరంబూర్ సీటు ఎవరికీ దక్కుతుందనే విషయం త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు ఈ సస్పెన్స్ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచుతూనే ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: