బిగ్ బాస్ 9:టైటిల్ ఫైట్ లో అసలైన పోరు..ఈవారం ఎవరికి షాక్ తగలబోతోంది..?
రీతూ ఎలిమినేట్ అయిన తర్వాత తనలో ఉండే కొత్త యాంగిల్ ని బయటకి తీశారు. ఇమ్మాన్యుయేల్ ని మించిన కామెడీతో ఆకట్టుకుంటున్న పవన్ మొదటి నుంచి ఇదే ఫన్ కొనసాగించి ఉంటే టైటిల్ రేసులో ఉండే వారిని ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు. అయితే డిమోన్ పవన్ కి ఈవారం షాక్ తగలబోతోందనే విధంగా వినిపిస్తోంది. విశ్లేషకులు చెబుతున్న ప్రకారం ఎవరు ఊహించిన స్థాయిలో ఓటింగ్ పవన్ కు పడట్లేదట.
డేంజర్ జోన్ లో ఉన్నాడని అతనికంటే భరణి, సంజన ఓటింగ్లో ముందున్నట్లు తెలియజేస్తున్నారు. అలాగే సరైన పిఆర్ టీమ్స్ సపోర్టు లేకపోవడం వల్లే పవన్ అనుకున్నంత స్థాయిలో ఓట్లు రాలేదని చర్చ కూడా ఇప్పుడు నడుస్తోంది. ఒకవేళ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం సుమన్ శెట్టితో పాటు, డిమోన్ పవన్ కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. మరి ఈ ఊహించని ఎలిమినేట్ నిజమవుతుందా లేకపోతే పవన్ సేఫ్ అవుతారా ?అనే విషయం తెలియాలి అంటే ఎపిసోడ్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. మొత్తానికి టైటిల్ రేసులో మాత్రం అసలైన పోరు కనిపిస్తోంది. టైటిల్ విన్నర్ ఎవరవుతారనే విషయం ఆడియన్స్ లో మరింత ఉత్కంఠత పెంచేసింది.