ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆఖరుగా పుష్ప పార్ట్ 2 అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో రష్మిక మందన హీరోయిన్గా నటించగా ... టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. పుష్ప పార్ట్ 1 మూవీ అదిరిపోయే రేంజ్ విజయం సాధించడం తో పుష్ప పార్ట్ 2 మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. దానితో ఈ సినిమా చాలా రోజుల పాటు అద్భుతమైన కలెక్షన్లను వసులు చేసి అదిరిపోయే రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే విడుదల అయిన రెండవ శుక్రవారం అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల విషయంలో ఈ మూవీ ఆ సమయంలో అదిరిపోయే రేంజ్ రికార్డును సృష్టించింది.
ఈ సినిమా విడుదల అయిన రెండవ శుక్రవారం రోజు 27.5 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి అదిరిపోయే రేంజ్ రికార్డులు సృష్టించింది. ఇకపోతే ఈ సినిమా సృష్టించిన రికార్డును తాజాగా రన్బీర్ సింగ్ హీరో గా రూపొందిన దురందర్ మూవీ క్రాస్ చేసింది. అసలు విషయం లోకి వెళితే ... కొన్ని రోజుల క్రితమే దురందర్ మూవీ భారీ అంచనాల నడుమ విడుదల అయింది. ఈ సినిమాకు సూపర్ సాలిడ్ పాజిటివ్ టాక్ వచ్చింది. దానితో ప్రస్తుతం ఈ మూవీ అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేస్తుంది. ఇకపోతే విడుదల అయిన రెండవ శుక్రవారం రోజు దురందర్ మూవీకి 34.7 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. దానితో ఈ మూవీ విడుదల అయిన రెండవ శుక్రవారం రోజు హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో మొదటి స్థానంలో నిలిచింది. ఈ మూవీ పుష్ప పార్ట్ 2 మూవీ నెలకొల్పిన రికార్డును క్రాస్ చేసి మొదటి స్థానంలో నిలిచింది. ప్రస్తుతం దురందర్ మూవీ కి అద్భుతమైన కలెక్షన్లు దక్కుతున్నాయి.