ది రాజా సాబ్: అడ్వాన్స్ బుకింగ్స్ తో దుమ్ములేపేతున్న ప్రభాస్..!
తాజాగా ఈ చిత్రానికి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ జోరు కూడా నార్త్ అమెరికాలో మొదలైనట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే 100K డాలర్లు (మన కరెన్సీ ప్రకారం రూ.83 లక్షల రూపాయలు) పైగా వసూలు సాధించినట్లు వినిపిస్తున్నాయి. ఈ లెక్క ప్రకారం చూసుకుంటే అమెరికాలో ప్రభాస్ క్రేజీ ఏ స్థాయిలో ఉందో ఊహించవచ్చు. రాబోయే రోజుల్లో ప్రమోషన్స్ కార్యక్రమాలను చేపడితే కచ్చితంగా ఓవర్సీస్ మార్కెట్లో రాజా సాబ్ సినిమా మరింత హైప్ పెరగడం ఖాయమని ట్రెండ్ వర్గాల తెలియజేస్తున్నాయి.
ఈ బడా ప్రాజెక్టులో ప్రభాస్ కి జోడిగా నిధి అగర్వాల్, రిద్ది కుమార్, మాళవిక మోహన్ నటిస్తున్నారు. ఈ చిత్రం హర్రర్ కామెడీ జోనర్లో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తోనే నిర్మిస్తున్నారు. వాస్తవంగా ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా సినిమా షూటింగ్ ఆలస్యం వల్ల వచ్చే ఏడాది జనవరి 9న విడుదల కాబోతోంది. మరి ఇటువంటి తరుణంలో బాక్సాఫీసు వద్ద ఎలాంటి ప్రభంజనం ప్రభాస్ సృష్టిస్తాడో చూడాలి మరి. ఈసారి సంక్రాంతి పోటీకి (జననాయగన్ , మన శంకర వరప్రసాద్ గారు, భర్త మహాశయులకు విజ్ఞప్తి, అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుమ మురారి, పరాశక్తి) భారీగానే సినిమాలు విడుదల కాబోతున్నాయి. మరి ఈసారి సంక్రాంతి విన్నార్ గా ఎవరు నిలుస్తారో చూడాలి మరి.