గీత గెలిస్తే డిప్యూటీ సీఎం పవన్ గెలిచినా పదవి లేనట్టే.. బాబు తీరు మారదుగా!

Reddy P Rajasekhar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గాలలో పిఠాపురం ఒకటి కాగా పిఠాపురం నుంచి వంగా గీతను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆమెకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తామని జగన్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గెలిస్తే ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే బాబు ఏం పదవి ఇస్తారంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తుండటం గమనార్హం.
 
చంద్రబాబు నాయుడు తీరు మారదని ఆయనను నమ్మి మోసపోక తప్పదని ఈ ఎన్నికల్లో అదే నిజం కానుందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పవన్ గెలిచినా పదవి లేనట్టేనా అని అభిమానులు చేస్తున్న కామెంట్లు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి. చంద్రబాబు నాయుడును నమ్మవద్దని ఆయన పార్టీలో 25 సంవత్సరాల పాటు ఉన్న నేతలే చెబుతారంటే బాబుపై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉందో అర్థమవుతుంది.
 
చంద్రబాబు నాయుడు తీరు మారదని ఈ ఎన్నికల్లో జగన్ చంద్రబాబును ఓడించి సీఎం కాబోతున్నారని తెలుస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చినా రాకపోయినా పవన్ సీఎం కావడం కల్ల అని పవన్ కు వాస్తవాలు అర్థం కావడానికి ఎంతో సమయం పట్టదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు పిఠాపురంలో డబ్బుల కిరికిరి నడుస్తోందని సోషల్ మీడియా వేదికగా వినిపిస్తోంది.
 
జనసేన నుంచి కొంతమందికి డబ్బులు అందితే మరి కొందరికి డబ్బులు అందలేదని సమాచారం అందుతోంది. వర్మ అండ్ కోకు డబ్బుల పంపిణీకి సంబంధించిన బాధ్యతలను అప్పగించడం హాట్ టాపిక్ అవుతోంది. జనసేనకు ఎన్నికల్లో సింగిల్ డిజిట్ ఫలితాలే వస్తాయని గతంతో పోల్చి చూస్తే మెరుగైన ఫలితాలు వచ్చినా లాభం ఉండదని తెలుస్తోంది. పిఠాపురంలో వంగా గీత గెలవవచ్చని మెజారిటీ సర్వేలు చెబుతున్నాయి. ఆ సర్వేల ఫలితాలు నిజమైతే మాత్రం జనసేన పరువు గంగలో కలిసే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: