ఫైనల్ సర్వే రిపోర్ట్.. అక్కడ కూటమి క్లీన్ స్వీప్?

praveen
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో అధికారాన్ని కోల్పోయి ప్రతిపక్ష హోదాకే పరిమితమైన చంద్రబాబు.. ఇక ఈసారి ఎట్టి పరిస్థితుల్లో సీఎం సీట్ లో కూర్చోవాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే తన 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని మొత్తం ఉపయోగించి వ్యూహాలను పన్నారు. ఇక జగన్ను ఒంటరిగా ఎదుర్కోలేము అని అర్థం చేసుకున్న బాబోరు.. జనసేన బిజెపి పార్టీలతో పొత్తు పెట్టుకుని ముందుకు సాగారు. సీట్ల సర్దుబాటు చేసుకుని  మరి ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

 అధికారంలో ఉన్న వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. రాజకీయ ఉద్దండుడిగా  పేరున్న చంద్రబాబు ఎంత ప్రయత్నిస్తున్న అటు ఏపీ ప్రజలు మాత్రం జగన్ వైపే ఉన్నారు అన్నది గట్టిగా వినిపిస్తున్న మాట. జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు.. వైసిపి ప్రజల గుండెల్లో నిలిచిపోయేలా చేశాయని.. ఆ పథకాలే ఇక ఇప్పుడు రెండోసారి జగన్ గెలిపించబోతున్నాయని ఇక వైసిపి నేతలు కూడా  బలంగా నమ్ముతున్నారు. ఇక అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా ఎంతో ఆచితూచి అడుగులు వేసిన జగన్ గెలుపు గుర్రాలను బరిలోకి దింపారు. అయితే ఏపీలో ఎన్నికల నగార మోగిన నుంచి ఎన్నో సర్వేలు తెరమీదకి వచ్చి హాట్ టాపిక్ గా మారిపోయాయి.

 ఇక ఇప్పుడు ఒక ఫైనల్ సర్వే రిపోర్ట్ కాస్త కూటమి క్లీన్ స్వీప్ అవ్వబోతుంది అని చెప్పకనే చెప్పింది. గతంలో ఏపీలో పట్టపద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో టిడిపి మూడు స్థానాలలో గెలుస్తుందని నెంబర్స్ తో సహా చెప్పేసిన పబ్లిక్ పాయింట్ సర్వే.. ఇక ఇప్పుడు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలపై కూడా సర్వే నిర్వహించింది. ఏకంగా ఒక్కో నియోజకవర్గంలో 5000 మందిపై ఆరు నెలల పాటు కష్టపడి సర్వే నిర్వహించి రిపోర్టు ఇచ్చింది. రిపోర్ట్ లో భాగంగా కడప నియోజకవర్గంలోని  పది నియోజకవర్గాల్లో కూటమి క్లీన్ స్వీప్ కాబోతుందట. పదికి 10 వైసీపీ నే గెలవబోతుందని.. ఈ సర్వే రిపోర్ట్ చెబుతోంది. మొత్తంగా కూటమికి 36 సీట్లు, వైసిపికి 112 సీట్లు వస్తాయని తెలిపింది. ఈ సర్వే రిపోర్ట్ ప్రకారం 25 చోట్ల కూటమికి వైసీపీకి మధ్య తీవ్రమైన పోటీ ఉంటుందని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: