ఉద్యోగులందరూ జగన్ కు యాంటీ అన్నారు.. టీచర్లు ఫ్యాన్ కు గుద్ది పడేశారు?

Reddy P Rajasekhar
సాధారణంగా ఏ ఎన్నికల్లో అయినా ఒక పార్టీ అధికారంలోకి రావడంలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర కీలకంగా ఉంటుంది. ఉద్యోగులందరూ జగన్ కు యాంటీ అని కూటమి అభ్యర్థులు ఇంతకాలం ప్రచారం చేసుకున్నారు. అయితే పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో మెజారిటీ ఓట్లు జగన్ కు అనుకూలంగా పడ్డాయని సమాచారం అందుతోంది. రాష్ట్రంలో టీచర్లు ఫ్యాన్ కు గుద్ది పడేశారని సమాచారం అందుతోంది.
 
సరిగ్గా ఎన్నికల సమయంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వైసీపీకే అనుకూలమని జరుగుతున్న ప్రచారం ఆ పార్టీకి ఎంతో ప్లస్ అవుతోంది. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ వయస్సు పెంచడం, వేతనాలను పెంచడం, జీపీఎస్ అమలు చేయడం, 25 వేల లోపు జీతం తీసుకునే ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు అమలయ్యేలా చేయడం, ఇతర కారణాల వల్ల టీచర్లు, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు ఫ్యాన్ కు ఓట్లు గుద్ది పడేశారని తెలుస్తోంది.
 
చంద్రబాబు పాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎదురైన కష్టాలను అన్నీఇన్నీ కావు. కొత్త నిబంధనలతో, చెత్త నిబంధనలతో చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు ఉద్యోగులకు కొత్త కష్టాలను క్రియేట్ చేశారు. జగన్ మాత్రం గత ఐదేళ్ల కాలం 2.34 లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగాలను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. జగన్ హయాంలో వచ్చినన్ని ప్రభుత్వ ఉద్యోగాలు గతంలో ఎప్పుడూ రాలేదు.
 
వైసీపీకి ప్రభుత్వ ఉధ్యోగులు మద్దతు దక్కడం ఆ పార్టీకి వరం కానుందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ ఎన్నికల్లో వైసీపీకి తిరుగులేదని మరోసారి ప్రూవ్ కానుందని 2009లో వైఎస్సార్ రెండోసారి సీఎం అయిన విధంగా 2024లో జగన్ మళ్లీ సీఎం కానున్నారని తెలుస్తోంది. వైసీపీపై వ్యతిరేకత అనేది కూటమి నేతలు చేస్తున్న ప్రచారమే తప్ప వాస్తవాలు కాదని తెలుస్తోంది.  ఉద్యోగులందరూ జగన్ కు యాంటీ కాదని కూటమికి యాంటీ అని ఈ ఎన్నికల ఫలితాలతో ప్రూవ్ కానుందని తెలుస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp

సంబంధిత వార్తలు: