పవన్ హరిహర వీరమల్లు నుండి స్పెషల్ పోస్టర్ విడుదల..!?

Anilkumar
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఇటీవల టిడిపి కూటమి ఘన విజయాన్ని సాధించింది. పోటీ చేసిన 21 స్థానాలు రెండు ఎంపీ సీట్లలో భారీ విజయాన్ని సాధించింది పవర్స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ప్రతి ఒక్క వార్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాదు ఆయన భారీ విజయాన్ని సాధించడంతో ఆయన అభిమానులు ఆనందంతో ఎగిరి గంతేస్తున్నారు. సంబరాలను జరుపుకుంటున్నారు.

 అలాగే ఆయన ఎలక్షన్స్ కంటే ముందు చేసిన సినిమాలకు సంబంధించిన అనౌన్స్మెంట్లు సైతం చేస్తున్నారు దర్శకులు. ఇందులో భాగంగానే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించిన కొత్త పోస్టర్ విడుదల చేశారు మేకర్స్ . ధర్మం దే విజయం అంటూ ఈ సినిమాలో వచ్చే ఒక డైలాగ్  గుర్తు చేస్తూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోస్టర్ విడుదల చేశారు. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. విక్టరీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న పవన్‌ కల్యాణ్‌, అభిమానుల కోసం విడుదల చేసిన నయా

 పోస్టర్‌ నెట్టింట వైరల్ అవుతోంది. పవన్ సరసన నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా అర్జున్ రాంపాల్‌, నర్గీస్ ఫక్రీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. లెజెండరీ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎంఎం కీరవాణి ఈ మూవీకి మ్యూజిక్‌, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌ అందిస్తున్నారు. రెండుపార్టులుగా సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాతో పాటు అటు సుజిత్ దర్శకత్వంలో చేస్తున్న ఓజి సినిమాకి సంబంధించి కూడా ఇటీవల ఒక పోస్టర్ విడుదల చేశారు చిత్ర బృందం. దీంతో ఆ పోస్టర్ సైతం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ స్థాయిలో విజయాన్ని అందుకోవడంతో అటు మెగా కుటుంబం సైతం పండగ చేస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: