రేవంత్ కు ధీటైన నేత కేటీఆర్ మాత్రమేనా.. ఆ లక్షణాలే రేవంత్ ఎదుగుదలకు కారణమా?

Reddy P Rajasekhar
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం రేవంత్ రెడ్డికి ధీటైన నేత ఎవరనే ప్రశ్నకు కేటీఆర్ పేరు సమాధానంగా వినిపిస్తోంది. వయస్సు, ఇతర కారణాల వల్ల కేసీఆర్ ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాలకు గుడ్ బై చెబితే బెటర్ అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రేవంత్ కు ధీటైన నేత కేటీఆర్ మాత్రమేనని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కేటీఆర్ తన వాగ్ధాటితో ఎలాంటి వాళ్లనైనా మెప్పించగలరు.
 
గతంలో మంత్రిగా పని చేసిన అనుభవం సైతం కేటీఆర్ కు ప్లస్ కానుంది. మారుతున్న రాజకీయాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో బీ.ఆర్.ఎస్ పార్టీ పుంజుకోవాలంటే కేటీఆర్ మాత్రమే ఆప్షన్ అని చెప్పవచ్చు. బీ.ఆర్.ఎస్ పార్టీ పేరును మళ్లీ టీ.ఆర్.ఎస్ గా మార్చి కేటీఆర్ రాష్ట్ర రాజకీయాలపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెడుతూ ప్రజల సమస్యలను వెలుగులోకి తెస్తూ కెరీర్ పరంగా ఎదిగేలా ప్లాన్ చేసుకోవాల్సి ఉంది.
 
రేవంత్ రెడ్డి ఎన్ని సమస్యలు ఎదురైనా వాటిని పరిష్కరించుకుంటూ ముందడుగులు వేస్తూ సీఎం స్థాయికి ఎదిగారు. కొన్ని కేసుల వల్ల ఇబ్బందులు ఎదురైనా రేవంత్ రెడ్డి వాటిని అధిగమించి సత్తా చాటారు. రేవంత్ రెడ్డి పొలిటికల్ కెరీర్ ప్రమాదంలో ఉందని ఒకానొక సమయంలో ప్రచారం జరిగినా రేవంత్ రెడ్డి మాత్రం వాటిని అధిగమిస్తూ ముందడుగులు వేయడం జరిగింది. ఈ లక్షణాలే రేవంత్ రెడ్డి ఎదుగుదలకు కారణమని చెప్పవచ్చు.
 
సామాన్యుల కష్టాలు సైతం రేవంత్ రెడ్డికి బాగా తెలుసు. అందువల్లే రేవంత్ రెడ్డిపై విమర్శలు చేయడానికి ఇతర పార్టీల నేతలు సైతం ఆలోచిస్తున్నారు. ఇతర రాష్ట్రాలను మించి సంక్షేమ పథకాలను అమలు చేయడం ద్వారా రేవంత్ రెడ్డి ఒక్కో మెట్టు పైకి ఎదుగుతున్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఇతర రాష్ట్రాల సీఎంలతో సైతం రేవంత్ రెడ్డి స్నేహ బంధాన్ని కొనసాగిస్తూ ఉండటం గమనార్హం. తెలంగాణ రాష్ట్రం అప్పులను సైతం వీలైనంత తగ్గించే దిశగా రేవంత్ రెడ్డి అడుగులు పడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: