కేసీఆర్ కు "కరెంట్ షాక్"..రిట్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు.!

Pandrala Sravanthi
బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయినప్పటి నుంచి కేసీఆర్ వేసిన ప్రతి అడుగు తప్పటడుగు అవుతుంది. తాజాగా ఆయన విద్యుత్  సమస్యపై వేసినటువంటి పిటిషన్  హైకోర్టు కొట్టేసింది. దీంతో కేసిఆర్ కు హైకోర్టులో కరెంట్ షాక్ తగిలినంత పనైంది. మరి కేసీఆర్ దేనిపై రిట్ పీటిషన్ వేశారు. ఆ వివరాలు చూద్దాం..జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ను రద్దు చేయాలంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రీట్ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ ను కొట్టేసింది హైకోర్టు. విద్యుత్ కొనుగోలపై విచారణకు ఆదేశిస్తూ  కమిషన్ ఏర్పాటు చేసింది ప్రస్తుత ప్రభుత్వం. దాన్ని సవాల్ చేస్తూ కేసీఆర్  ఒక పిటిషన్ దాఖలు చేశారు. కానీ దాన్ని కొట్టి పారేస్తూ ఆదేశాలు జారీ చేసింది చీఫ్ జస్టిస్ బెంచ్. 

విద్యుత్ కమిషన్ కొనసాగించుకోవచ్చని స్పష్టం చేసింది హైకోర్టు. నిబంధన మేరకే పవర్ కమిషన్ పనిచేస్తుందని , కేసీఆర్ వేసిన పిటిషన్ లో స్పష్టత లేదని  అడ్వకేట్ జనరల్ వాదనను హైకోర్టు చీఫ్ జస్టిస్  ధర్మాసనం సమర్ధించుకుంటూ వచ్చింది. విద్యుత్ కమిషన్ ఏకపక్షంగానే వ్యవహరిస్తున్నదని కేసీఆర్ తరపు న్యాయవాదులు మాట్లాడడంతో, దాన్ని విభేదిస్తూ  హైకోర్టు ఆ పిటిషన్ ను కొట్టి పడేసింది. దీంతో హైకోర్టు పవర్ కమిషన్ విచారణకు లైన్ క్లియర్  అయింది. ఇదే తరుణంలో కేసీఆర్ కు పవర్ కమిషన్ నోటీసులు కూడా పంపనుంది.

 దీనిపై బిఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు జరిగిన విద్యుత్ కొనుగోళ్లు, ఒప్పందాలపై  లిఖితపూర్వకమైనటువంటి సమాధానం ఇవ్వాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పవర్ కమిషన్ కోరుతూ నోటీసులు ఇచ్చిన విషయం మనందరికీ తెలుసు. దీనిపై సమయం కావాలని కేసిఆర్  చేసినటువంటి విజ్ఞప్తిని కమిషన్ తోసి పుచ్చింది.  అయితే దీంతో పవర్ కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నదని ఆరోపణలు చేస్తూ కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. దానిపై రిట్ పిటిషన్ వేయగా  న్యాయస్థానం ఈ పిటీషన్ ను కొట్టివేయడంతో కేసీఆర్ విద్యుత్ కమిషన్ ముందు  తొందరలోనే హాజరు కావాల్సి వస్తుంది. ఈ విధంగా కేసీఆర్ కు విద్యుత్ షాక్ తగిలింది అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: