కరెంట్ బిల్లులు యాప్స్ చెల్లింపులకు బంద్.. కారణం..?

Divya
ప్రస్తుతమున్న టెక్నాలజీలో చాలా మంది కరెంట్ బిల్లులు ఇతరత్న చెల్లింపులను చేయడానికి ఎక్కువగా ఫోన్ పే, గూగుల్ పే, పేటియం, అమెజాన్ ఇతరత్రా వంటి యాప్స్ లను ఉపయోగించి కరెంట్ బిల్లులు ఇతరత్రా వాటిని చెల్లించేవారు. అయితే ఈ నెల నుంచి విద్యుత్ బిల్లులు చెల్లింపులకు సాధ్యం పడదు అంటూ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ నిన్నటి రోజున ఒక మేరకు ప్రకటన కూడా చేయడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ తూర్పు విద్యుత్ సంస్థ సైతం..APEDCL తమ వెబ్సైట్ లేదా మొబైల్స్ యాప్ల తోనే ఈ బిల్లులను సైతం చెల్లించాలి అంటూ వినియోగదారులకు ఈ మేరకు ఒక సూచన కూడా ఇచ్చింది.

ఆర్.బి.ఐ మార్గదర్శాలను అనుసరించి జులై ఒకటవ తేదీ నుంచి ఈ చెల్లింపులు నిలిపివేస్తున్నట్లు తెలియజేశారు. తెలంగాణ , ఏపీ మాత్రమే కాకుండా తెలుగు రాష్ట్రాలలో ఇతర డిస్కౌంట్ అది కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది..TGNPDCL, APSPDCL, APCPDCL పరిధిలో బిల్లులు చెల్లించాలని ప్రయత్నిస్తున్నప్పుడు భారత్ బిల్ పేమెంట్ సిస్టంకు అవి రిజిస్ట్రేషన్ కావడం లేదనే విధంగా తెలియజేస్తున్నాయి. దీనివలన పెద్ద సంఖ్యలో వినియోగదారుల పైన చాలా ప్రభావం పడుతుంది అంటూ ప్రభుత్వాలు తెలియజేస్తున్నాయి. అందుకే ఇక మీదట ఇలాంటి గూగుల్ పే ఇతరత్రా యాప్స్ ద్వారా చెల్లించకూడదంటూ తెలిపారు.

బిల్లు చెల్లింపు సమర్థత భద్రతకు సైతం పెద్దపీట వేసేందుకు ఆర్బిఐ కీలక నిర్ణయం తీసుకున్నది. ఇకమీదట బిల్లులు BBPS పేమెంట్ ద్వారానే జలగాలంటూ నిర్దేశించాయి. ప్రైవేటు బ్యాంకులకు సంబంధించి ఐసిఐసిఐ బ్యాంక్ హెచ్డీఎఫ్సి యాక్సిస్ బ్యాంక్ వంటి వాటికి ఈ పేమెంట్ సిస్టం యాక్టివేషన్ చేసుకోలేరట.. దీంతో ఫోన్ పే క్రెడిట్ వంటి కంపెనీ కస్టమర్లు క్రెడిట్ కార్డు బిల్లుల పైన ప్రాసెస్ కూడా చేయలేరంటూ తెలియజేశారు.దీనివల్ల ఆ యాప్స్ క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లింపు వీలుపడదని కూడా తెలియజేసింది. ఇప్పుడు ఏకంగా విద్యుత్ బిల్లులు చెల్లింపు విషయంలో కూడా ఇదే జరుగుతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: