ఫ్యామిలీ ఆడియన్స్ కి కల్కి గుడ్ న్యూస్..!?

Anilkumar
రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ సినిమానే 'కల్కి 2898 ఏడీ'. నాగ్ అశ్విన్ తీసిన ఈ మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించాడు. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటించింది. అలాగే, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీలు ఇందులో నటించారు. ఇండియన్ స్క్రీన్‌పై ఎపిక్ సైన్స్ ఫిక్షన్‌గా రూపొందిన కల్కి 2898 ఏడీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల ఊచకోత కోస్తున్నది. . కల్కి 6వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద సందడి

 చేసింది. ఈ చిత్రం తాజా సమాచారం ప్రకారం.. తెలుగులో 11.5 కోట్లు, తమిళంలో 1.5 కోట్లు, హిందీలో 14 కోట్ల రూపాయలు, మలయాళంలో 1.5 కోట్ల రూపాయలు వసూలు చేస్తందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశారు. అయితే ఈ విషయం కాసేపు పక్కన పెడితే కల్కి టికెట్స్ రేట్లు చూసి మధ్యతరగతి కుటుంబాలు షాక్ అవుతున్నారు. కల్కి టికెట్ రేట్లు చూసే సినిమా చూడకుండా వెనకడుగు వేస్తున్నారు. అయితే కల్కి సినిమా విడుదలైన రోజు టికెట్స్ రేట్ ఎక్కువ ఉన్నప్పటికీ నిదానంగా ఇప్పుడు పలుచోట్ల తగ్గాయి. ఈ సినిమాకు

 హైదరాబాద్ సహా ఇతర మల్టీప్లెక్స్ లో ఒక్కో టికెట్ ధర రూ. 450 నుంచి రూ. 500 వరకు ఉంది. అదే సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అయితే.. రూ. 250 ఉంది. ఒక ఫ్యామిలీలో నలుగురు ఈ సినిమా చూడాలనుకుంటే మల్టీప్టెక్స్ లో రూ. 2 వేల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది.   ఒక కామన్ మిడిల్ క్లాస్ ప్రేక్షకులకు ఈ టికెట్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. అందుకే ఈ సినిమా టికెట్ ధరలు తగ్గితే చూడాలనుకుంటున్నారు. వారి కోసం కల్కి మూవీ టికెట్స్ ను ఈ గురువారం కానీ శుక్రవారం నుంచి మల్టీప్లెక్స్ లో రూ. 250, సింగిల్ స్క్రీన్స్ లో రూ. 150 చేయనున్నారట. ఒకవేళ టికెట్ రేట్స్ తగ్గిస్తే .. చాలా మంది కామన్ లోయర్, మిడిల్ క్లాస్ పీపుల్ .. ఈ సినిమాను తమ ఫ్యామిలీతో కలిసి చూసే భాగ్యం కలుగుతుంది. ఇలా చేయడం వల్ల రిపీట్ ఆడియన్స్ కూడా పెరిగే అవకాశాలున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: