టి20 రిటైర్మెంట్ గురించి.. రోహిత్ ముందు ఎవరికి చెప్పాడో తెలుసా?

praveen
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల అంతర్జాతీయ టి20 ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు అన్న విషయం తెలిసిందే. వెస్టిండీస్ యుఎస్ వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ 2024 ఎడిషన్ లో టీమిండియా అద్భుతమైన ప్రదర్శన చేసింది. ఒక్క ఓటమి కూడా లేకుండా ఫైనల్ వరకు దూసుకు వెళ్లడమే కాదు ఫైనల్ లో కూడా ఎలాంటి తప్పిదాలు చేయకుండా విజయం సాధించింది. దీంతో దాదాపు 13 ఏళ్ల నిరీక్షణకు తెర దింపుతూ వరల్డ్ కప్ టైటిల్ ని ముద్దాడింది అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే కపిల్ దేవ్,మహేంద్ర సింగ్ ధోనీల తర్వాత రోహిత్ శర్మ టీం ఇండియాకు వరల్డ్ కప్ అందించిన మూడో కెప్టెన్ గా చరిత్ర సృష్టించాడు. ఇక అతను ఈ వరల్డ్ కప్ సీజన్లో టీమ్ ఇండియాను ఎంతో విజయవంతంగా నడిపించిన తీరు అందరినీ మంత్రముగ్దులను చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ కెప్టెన్సీ పై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే వరల్డ్ కప్ గెలిచిన సమయం కంటే మరో మంచి సమయం దొరకదు అని భావించిన రోహిత్ శర్మ.. తన అంతర్జాతీయ క్రికెట్ కెరియర్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. వన్డేలు టెస్ట్ మ్యాచ్ లలో మాత్రం కొనసాగుతాను అంటూ క్లారిటీ ఇచ్చాడు.

 ఈ క్రమంలోనే వరల్డ్ కప్ గెలిచిన ఆనందం ఉన్నప్పటికీ అభిమానులు మాత్రం రోహిత్ శర్మ రిటైర్మెంట్ తో ఒకసారిగా షాక్ అయ్యారు. అయితే రోహిత్ శర్మ రిటైర్మెంట్ కు సంబంధించిన విషయం ముందుగా ఎవరికీ చెప్పారు అన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక ఇటీవల రోహిత్ పూర్ణిమ శర్మ ఒక స్పోర్ట్స్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను పంచుకున్నారు. టి20 వరల్డ్ కప్ 2024 కోసం వెళ్లే ముందు తనను రోహిత్ కలిశాడు అంటూ ఆమె చెప్పుకొచ్చారు.  అయితే అప్పుడే తన టి20 రిటైర్మెంట్ గురించి రోహిత్ తనతో చెప్పాడు అంటూ పేర్కొన్నారు. నేను ఈ రోజును చూస్తానని ఎప్పుడు అనుకోలేదు. టి20 ప్రపంచకప్ 2024 కు వెళ్లే ముందు రోహిత్ మమ్మల్ని కలవడానికి వచ్చాడు. తర్వాత టి20 లకు వీడ్కోలు తీసుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. నేను కప్ గెలవడానికి ప్రయత్నించండి అని చెప్పా. కప్ గెలిచినందుకు సంతోషంగా ఉంది అంటూ రోహిత్ తల్లి పూర్ణిమ  చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: