ఇది చిన్న బ్రేక్ మాత్రమే.. విశ్వక్సేన్ కామెంట్స్..!

lakhmi saranya
మాస్ కా దాస్ గా పాపులారిటీ సంపాదించుకున్న హీరో విశ్వక్సేన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అతి తక్కువ సమయంలోనే మాస్ ఇమేజ్ ని తన సొంతం చేసుకున్నాడు విశ్వక్సేన్. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు. ఇక తాజాగా తన కొత్త సినిమా లైలా కార్యక్రమాలతో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో విశ్వక్ తొలిసారి ఓ లేడీ గెటప్ లో కనిపించాడు. దీంతో ఈ మూవీలో ఆయన లుక్స్ పరంగా ఎలా ఉండబోతున్నాడనే అంచనాలు భారీగా ఉన్నాయి.

అయితే రీసెంట్ గా విశ్వక్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ను డియాక్టివేట్ చేశాడు. ఆయన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఎందుకు ఇలా చేశాడు అని అభిమానులు ఆందోళన పడుతున్నారు. ఇక ఈ క్రమంలో తన అభిమానులకి ఓ క్లారిటీ ఇచ్చాడు. ఈ యంగ్ హీరో. " గత కొద్ది రోజులుగా నా instagram అకౌంట్ ను ఎందుకు? డియాక్టివేట్ చేశాను అని అభిమానుల నుంచి వరుసగా మెసేజ్లు వచ్చాయి. నేను కొద్ది రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. నాకు ఏదో హాని జరుగుతుందని ఈ నిర్ణయం తీసుకోవడం లేదు.

ఇందులో భాగంగా నా ఇంస్టాగ్రామ్ ను డియాక్టీవేట్ చేశాను. నా ట్విట్టర్ హ్యాండిల్ ని కూడా నా టీం మేనేజ్ చేస్తుంది. సోషల్ మీడియాలో ఉంటేనే జీవితం ముందుకు సాగుతుందని కాదు . అందుకే ఈ సోషల్ మీడియాను కొంతవరకే సీరియస్ గా తీసుకోండి . నేను నా నెక్స్ట్ మూవీ రిలీజ్ తరువాత తిరిగి సోషల్ మీడియాలోకి రావచ్చు . రాకపోవచ్చు " అంటూ విశ్వక్సేన్ క్లారిటీ ఇచ్చాడు . ప్రజెంట్ విశ్వక్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . ఏదేమైనాప్పటికీ విశ్వక్సేన్ పెద్ద డెసిషన్ తీసుకున్నాడని చెప్పుకోవచ్చు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: