బన్నీ కామెంట్ల గురించి మంత్రి రియాక్షన్ వైరల్.. బన్నీకి భారీ షాకిచ్చారుగా!

Reddy P Rajasekhar
స్టార్ హీరో అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి పేరెత్తకుండానే తెలంగాణ సీఎంను టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా సంచలనం అవుతున్నాయి. ఈ కామెంట్ల గురించి తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి నుంచి కౌంటర్ వచ్చింది. థియేటర్ ఘటనను రాజకీయం చేయొద్దని ఆయన అన్నారు. బన్నీ కామెంట్స్ తెలంగాణ సీఎంను అవమానపరిచే విధంగా ఉన్నాయని కోమటిరెడ్డి కామెంట్లు చేశారు.
 
బన్నీ తన కామెంట్లను వెనక్కు తీసుకోవాలని ఆయన సూచించారు. సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించి అన్ని ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని కోమటిరెడ్డి వెల్లడించారు. అనుమతులు లేకుండా బన్నీ థియేటర్ కు వచ్చారని ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీకి మధ్య గ్యాప్ లేదని చెప్పుకొచ్చారు. సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఘటనను రాజకీయం చేయొద్దని ఆయన కోరారు.
 
చట్టం తన పని తాను చేసుకుపోతుందని పరామర్శకు లీగల్ సమస్యలేంటని ఆయన ప్రశ్నించారు. శ్రీ తేజ్ వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. సినిమా ఇండస్ట్రీ శ్రీ తేజ్ ను ఎందుకు పరామర్శించలేదని కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు. బన్నీ వర్సెస్ రేవంత్ రెడ్డి అనే పరిస్థితి ఏర్పడిందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
 
ఈ వివాదం విషయంలో మరిన్ని ట్విస్టులు చోటు చేసుకోవడం పక్కా అని ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి రాబోయే రోజుల్లో బన్నీ చేసిన కామెంట్లపై స్పందించే అవకాశాలు అయితే ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బన్నీకి భారీ షాకులు తగులుతుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.  స్టార్ హీరో  అల్లూ అర్జున్ భవిష్యత్తు సినిమాలపై కూడా తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఎఫెక్ట్ పడే అవకాశాలు అయితే ఉన్నాయని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నారు. బన్నీ కెరీర్ పై ఈ వివాదం ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: