తారక్ ఇంటర్నేషనల్ సినిమా..న్యూ ఇయర్ కి ఫ్యాన్స్ కి బిగ్ సర్ప్రైజ్..!

Thota Jaya Madhuri
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటించిన సూపర్ హిట్ చిత్రం ‘దేవర’ తర్వాత, స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందబోయే భారీ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా పై తారక్ ఫ్యాన్స్ నే కాదు స్టార్ సెలబ్రిటీస్ సైతం ఆశలు పెట్టుకుని ఉన్నారు.  ఈ కాంబినేషన్ ప్రకటించిన నాటి నుంచే సినిమా ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందా అనే ఉత్కంఠ అభిమానుల్లో మరింత పెరుగుతూనే ఉంది.‘ఆర్ ఆర్ ఆర్ ’ తర్వాత కొంత ఆలస్యంగా ప్రారంభమైన దేవర తరహాలోనే, ఈ కొత్త సినిమా కూడా కొద్దిగా లేట్ అవుతున్నప్పటికీ, ప్రతి చిన్న అంశాన్ని అత్యంత పక్కాగా ప్లాన్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారని సినీ వర్గాల సమాచారం. కథ, పాత్రలు, టెక్నికల్ అంశాలు అన్నీ కూడా అంతర్జాతీయ స్థాయిలో ఉండేలా దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా లోకేషన్ హంటింగ్ దశలో కొనసాగుతోంది.



ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్న జోర్డాన్ తాజాగా అమన్ ప్రాంతానికి చెందిన అద్భుతమైన విజువల్స్ ను తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నాడు. ఈ ఫోటోలు చూసిన అభిమానులు, సినిమా షూటింగ్ కోసం లొకేషన్లు ఫైనల్ చేసే పనిలో టీమ్ బిజీగా ఉందని భావిస్తున్నారు. ఈ విజువల్స్ సినిమాకు గ్రాండ్ స్కేల్‌ను మరింత పెంచబోతున్నాయనే అంచనాలు కూడా వ్యక్తమవుతున్నాయి.ఇక ఈ సినిమాను మేకర్స్ కేవలం పాన్ ఇండియా మూవీగా కాకుండా, ఒక ఇంటర్నేషనల్ స్థాయి సినిమాగా రూపొందిస్తున్నామని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. దీనితో ఎన్టీఆర్ అభిమానుల ఎగ్జైట్మెంట్ మరింత పెరిగింది. ప్రశాంత్ నీల్ మార్క్ మాస్ యాక్షన్, పవర్ ఫుల్ కథనంతో ఎన్టీఆర్‌ను ఇప్పటివరకు చూడని విధంగా చూపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు న్యూ ఇయర్ సంధర్భంగా ఈ సినిమా నుంచి ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేయబోతున్నారట.



ఈ చిత్రంలో కథానాయికగా రుక్మిణి వసంత్ నటిస్తుండగా, ప్రతిష్టాత్మక బ్యానర్లు అయిన movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్, అంతర్జాతీయ స్థాయి టెక్నికల్ టీమ్‌తో రూపొందుతున్న ఈ సినిమా, ఇండియన్ సినిమాను కొత్త స్థాయికి తీసుకెళ్తుందని అభిమానులు విశ్వసిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: