పుష్ప-2తో యూత్ చెడిపోతున్నారు.. కోమటిరెడ్డి షాకింగ్ కామెంట్స్?
దీని తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రేవతి కుమారుడు శ్రీతేజ్‌ను పరామర్శించారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. తన కుమారుడు ప్రతీక్ ఒక చారిటీ ఫౌండేషన్ ప్రారంభించగా దాన్నుంచే 25 లక్షల రూపాయలను శ్రీ తేజ్ తండ్రికి అందజేశారు కోమటిరెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజానికి ఉపయోగపడే హిస్టరీ లేదంటే దేవుళ్ల గురించి గొప్పగా చూపించే సినిమాలను తాము బాగా ప్రోత్సహిస్తామని చెప్పారు. వాటికి మాత్రమే టికెట్ ప్రైస్ లు పెంచుతామన్నారు. అది కూడా ఎక్కువ కాదు జస్ట్ కొంత మాత్రం పెంచి ప్రజలపై ఎలాంటి ప్రభావం పడకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. తెలంగాణ నేపథ్యం ఉన్న సినిమాలను కూడా బాగా ప్రోత్సహిస్తామని చెప్పారు.
ఈ సినిమాటోగ్రఫీ మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో ఇకపై బెనిఫిట్ షోలు అనేవి చూడటం కష్టమే అని కుండ బద్దలు కొట్టారు. శ్రీ తేజ్ వైద్య ఖర్చులను మొత్తం తెలంగాణ గవర్నమెంట్ పెట్టుకున్నట్లు కూడా ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. వెంకట్ రెడ్డి శ్రీ తేజ హెల్త్ పై కూడా ఒక అప్‌డేట్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ ఆ బాలుడు ఒక ఏడాది లేదంటే రెండు నెలల వరకు కోరుకునే పరిస్థితి లేదని డాక్టర్లు తనకు చెప్పినట్లు పేర్కొన్నారు. అంతే కాదు మాటలు కూడా రాకపోవచ్చు అని వెల్లడించారు. అయితే నిన్నేమో రేవంత్ రెడ్డి దీని అంతటికి బాధ్యులు ఒక్క అల్లు అర్జున్ మాత్రమే అని కామెంట్లు చేశారు. ఇప్పుడు కోమటిరెడ్డి కూడా అతని వైపే టార్గెట్ చేయడం సంచలనంగా మారింది. ఇందులో పోలీసులు తప్పు ఏమీ లేదు అన్నట్లు మొత్తం ఒకరిపైనే నింద వేయడం అన్యాయమని కొంతమంది వాదిస్తున్నారు