సరైన టైంలో కరెక్ట్ పాయింట్ తో కొట్టిన రేవంత్ రెడ్డి.. ఇక బన్నీ కెరియర్ నాశనం అయిపోయిన్నట్లే పో..!?

Thota Jaya Madhuri
ఇప్పుడు ఎక్కడ చూసినా సరే అల్లు అర్జున్ పై నెగిటివ్ ట్రోలింగ్ ఎక్కువగా జరుగుతుంది . దానికి కారణం సంధ్య ధియేటర్ ఘటనలో ఆయన అరెస్టు అవ్వడమే . బెయిల్ పై బయటకి వచ్చాడు. ఆ తర్వాత పరిస్థితి అంతా కంట్రోల్ లోకి వచ్చింది అని అంతా భావించారు . కానీ అసెంబ్లీలో ఎవరు ఊహించని విధంగా రేవంత్ రెడ్డి ..అల్లు అర్జున్ పేరును ప్రస్తావించడం ట్రెండ్ అయింది. అయితే అల్లు అర్జున్ కి పోలీసులు చెప్పినా కూడా బన్నీ మొండిగా సినిమా చూశాకే వెళ్తాను అంటూ వాదించాడు అని అసలు ఓ హీరోకి అలాంటి క్వాలిటీ ఎలా ఉంటుంది అంటూ ఏకిపారేశారు.  అయితే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మరి తనపై ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తున్నారు అని ..తనపై చెప్పిన వార్తలు మొత్తం తప్పే అని తన వద్దకు ఎటువంటి పోలీసులు రాలేదు అని తన మేనేజ్మెంట్ వచ్చి బయట పరిస్థితి బాగోలేదు సార్ అంటూ తనను బయటకు పంపించేశారు అని చెప్పుకొచ్చారు .


అయితే ఇదే క్రమంలో సోషల్ మీడియాలో ఒక సెన్సేషనల్ వీడియో సంచలనంగా మారింది. అసలు అల్లు అర్జున్ వల్లే సంధ్యా థియేటర్లో అంత రాద్ధాంతం జరిగింది అని చెప్పే విధంగా ఆ వీడియో ఉంది.  మొదటగా అల్లు అర్జున్ మామ పెద్ద కారులో అక్కడికి రావడం .. ఆ టైంలో పోలీసులు సెక్యూరిటీ ఇవ్వడానికి ట్రై చేయడం .. గేట్లు ఓపెన్ చేయడం జనాలు ముందుకు దూసుకొచ్చేయడం.. ఆ తర్వాత అల్లుఅయ్యాన్  పెద్ద కార్ లో అక్కడికి రావడం అయాన్ కోసం కూడా అక్కడ సెక్యూరిటీ ఏర్పాటు చేయడం.. అయ్యాను జాగ్రత్తగా లోపలికి తీసుకెళ్లడం ..ఆ తర్వాత భారీ రోడ్ షో నిర్వహించే విధంగా ఉన్నటువంటి అల్లు అర్జున్ కి సంబంధించిన ఒక వీడియో కూడా బాగా ట్రెండ్ అవుతుంది .


అయితే థియేటర్లోకి అల్లు అర్జున్ వచ్చాక పరిస్థితి ఎలా అదుపుతప్పింది అనే విషయం వీడియోలో క్లియర్గా అర్థం అయిపోతుంది . అంతకుముందు వరకు ప్రశాంతంగా వాతావరణం ఉండింది.  అల్లు అర్జున్ ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చాడో అప్పటితో మొత్తం కంట్రోల్ తప్పిపోయింది . ఈ క్రమంలోనే అల్లు అర్జున్ చూడడానికి జనాలు ఎగబడిపోవడంతో .. అక్కడ అంత పెద్ద ఇష్యూ జరిగింది అన్న విషయం క్లియర్గా అర్థం అయిపోతుంది. అయితే నిన్న మొన్నటి వరకు అసలు ఈ వీడియో బయటకే రాలేదు .


అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో ఎప్పుడైతే పోలీసులు నా వద్దకు రాలేదు అని చెప్పాడో.. ఆ క్షణమే ఈ వీడియో రిలీజ్ చేయడం సంచలనంగా మారింది. రేవంత్ రెడ్డినే  ఇలా పక్క ప్రూఫ్ తో వీడియోని రిలీజ్ చేసే విధంగా చేశారు అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు . సోషల్ మీడియాలో ప్రజెంట్ ఈ వీడియో బాగా వైరల్ గా మారింది . ఈ వీడియో చూసిన తర్వాత చాలా మంది జనాలు కూడా అల్లు అర్జున్ దే తప్పు అంటూ వాదిస్తున్నారు . అల్లు అర్జున్ సినీ కెరియర్ ఇక క్లోజ్ అన్న విధంగా కూడా మాట్లాడుకుంటున్నారు . 22 ఏళ్ల కష్టపడిన అల్లు అర్జున్ ఒకే ఒక పుష్ప2 సినిమాతో మొత్తం సర్వనాశనం చేసేసుకున్నాడు అంటూ మాట్లాడుకుంటున్నారు . ఈ వీడియో పై అల్లు అర్జున్ ఎలా స్పందిస్తాడో..? అంటూ జనాలు వెయిట్ చేస్తున్నారు..!



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: