తస్మాత్ జాగ్రత్త.. యమలోకానికి దారులు వేస్తున్న బూట్లు?

praveen
వర్షాకాలం వచ్చిందంటే ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణముంటుంది. ఎందుకంటే మొన్నటి వరకు ఎండలతో బెంబేలెత్తిపోయిన జనాలు ఇప్పుడు వర్షంలో కాసేపు హాయిగా తడవడానికి ఇష్టపడుతుంటారు. ఇంకొంతమంది గలగల పారే జలపాతాలకు వెళ్లి ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక వర్షాలు పడటంతో ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తూ ఉంటుంది. ఇలా వర్షాకాలం వచ్చిందంటే ఎక్కడ చూసినా ఆహ్లాదకరమైన వాతావరణమే కనిపిస్తుంది.

 కానీ  ఇదే వర్షా కాలంలో ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా.. చివరికి ప్రాణాలు తీసే ప్రమాదాలు ఎక్కడికక్కడ పొంచి ఉంటాయి. ఏకంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో పాములు తేళ్లు లాంటి ప్రమాదకరమైన జీవులు కనిపిస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఇలాంటి తరహా వీడియోనే ఒకటి వైరల్ గా మారిపోయింది. ఏకంగా రోజు వాడే షూస్ యమలోకానికి దారులు వేస్తాయి అంటే నమ్ముతారా.. ఈ వీడియో చూస్తే మాత్రం తప్పకుండా నమ్ముతారు. ఎందుకంటే షూస్ వేసుకునే సమయంలో ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా చివరికి యమలోకానికి వెళ్లిపోతారు.

 ఎందుకంటే షూస్ లో ఏకంగా విష పూరితమైన పాములు కీటకాలు నక్కి ఉంటున్నాయి అన్న విషయం ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇలా వైరల్ గా మారి పోయిన వీడియో లో ఏకంగా నాగుపాము షూ లోపల దాగి ఉంది. అయితే ఈ విషయాన్ని గమనించకుండా బాలిక ధరించి ఉంటే మాత్రం చివరికి ప్రాణాలు కోల్పోయేది. కానీ వెంటనే గ్రహించి స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ ఆ పామును పట్టుకునేందుకు ప్రయత్నించగా.. షో నుండి బయటికి వచ్చిన పాము పడగ విప్పి బుసలు కొడుతుంది. కుటుంబ సభ్యులందరూ ఒక్క సారిగా భయం తో వనికి పోయారు. అందుకే ఇక ఎక్కడికైనా బయటికి వెళ్తున్నప్పుడు షూస్ వేసుకునే ముందు జాగ్రత్త పడటం ఎంతో మంచిది అని నిపుణులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: