సమంతకు బిగ్ ఛాన్స్.. భర్తతో కలిసి బాలీవుడ్ ప్రాజెక్ట్!

Amruth kumar
టాలీవుడ్ క్వీన్, మనందరి ఫేవరెట్ సమంత రూత్ ప్రభు కెరీర్ ఇప్పుడు మరో సెన్సేషనల్ మలుపు తిరగబోతోంది. గత కొంతకాలంగా కథల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్న సామ్, ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ సుల్తాన్ సల్మాన్ ఖాన్ పక్కన మెరవబోతుందనే వార్త ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. అది కూడా తన భర్త దర్శకత్వంలోనే ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఉండబోతుండటం ఇప్పుడు ‘నేషనల్’ లెవల్ టాపిక్!



ఈ సినిమాకు మరో స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటంటే.. దీనిని ప్రముఖ దర్శక ద్వయం రాజ్ నిడిమోరు - డీకే తెరకెక్కించబోతున్నారు.సమంత ఇటీవల దర్శకుడు రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు భర్త డైరెక్షన్‌లోనే సామ్ హీరోయిన్‌గా నటించే అవకాశం రావడం సినీ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది.
కథలో హీరోయిన్ పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉందని, అందుకే సమంత అయితేనే కరెక్ట్ అని డైరెక్టర్లు భావిస్తున్నారట. గతంలో ‘ది ఫ్యామిలీ మ్యాన్’తో పాన్ ఇండియా లెవల్లో సామ్ సృష్టించిన ఇంపాక్ట్ మనకు తెలిసిందే.



టాలీవుడ్ టాప్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ భారీ ప్రాజెక్టును నిర్మించబోతోంది.భారీ బడ్జెట్‌తో, అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌లతో ఈసినిమానురూపొందించబోతున్నారు.సల్మాన్ ఖాన్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. ఆ ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే, అంటే ఈ ఏడాది నవంబర్‌లో రాజ్-డీకే సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.బాలీవుడ్ ప్రాజెక్ట్ సంగతి పక్కన పెడితే, సమంత నటిస్తున్న ‘మా ఇంటి బంగారం’ సినిమా విడుదలకు సిద్ధమైంది.



ఈ సినిమా మే నెలలో థియేటర్లలోకి రాబోతోంది. సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపై సామ్ కనిపించబోతుండటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.సమంత తన పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేస్తూ బాలీవుడ్ వైపు అడుగులు వేయడం ఆమెలోని దృఢత్వానికి నిదర్శనం.సమంత బాలీవుడ్ ఎంట్రీ వార్త అసలైన కిక్ ఇస్తోంది. నిజంగా ఈ ప్రాజెక్ట్ ఖరారైతే, భర్త దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ తో సామ్ చేసే రచ్చ థియేటర్లలో చూడటం ఒక అరుదైన అనుభూతి అవుతుంది.అదే సమయంలో ఇది సమంత కెరీర్‌లో భారీ రీఎంట్రీగా మారే అవకాశముందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: