కోహ్లీతో బాబర్ కు పోలికా.. పాక్ మాజీ షాకింగ్ కామెంట్స్?

praveen
టీమ్ ఇండియాలో స్టార్ ప్లేయర్గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ గురించి ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే తన ఆట తీరుతో ఇక వరల్డ్ క్రికెట్ నే శాసించే స్థాయికి ఎదిగాడు కోహ్లీ. అందరిలాగానే ఒక సాదాసీదా ఆటగాడుగా జట్టులోకి వచ్చినప్పటికీ ఇక ఇప్పుడు రికార్డుల రారాజుగా పిలిపించుకుంటున్నాడు. ఎందుకంటే ఇప్పటివరకు ఎంతోమంది లెజెండరి క్రికెటర్స్ కెరియర్ కాలం మొత్తంలో సాధించిన రికార్డులను విరాట్ కోహ్లీ ఎంతో అలవోకగా బద్దలు కొట్టాడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

 అయితే అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసి దశాబ్దం కాలం గడిచిపోతున్నప్పుడు.. ఇంకా ఏదో సాధించాలి అనే కసి కోహ్లీలో కనిపిస్తూనే ఉంటుంది అని చెప్పాలి. అయితే ఇక ప్రస్తుతం భారతీయ జట్టులో మూడు ఫార్మట్ లలో కూడా కీలక ప్లేయర్గా కొనసాగిన విరాట్ కోహ్లీ.. ఇక ఇటీవల అంతర్జాతీయ టి20 కెరియర్ కు రిటైర్మెంట్ ప్రకటించి అభిమానులందరికీ కూడా షాక్ ఇచ్చాడు అని చెప్పాలి. అయితే కోహ్లీని అభిమానులు రన్ మిషన్, కింగ్ కోహ్లీ లేదంటే రికార్డుల రారాజు అని పిలుచుకుంటూ ఉంటారు. అలాంటి విరాట్ కోహ్లీతో పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్ ని పోల్చి చూస్తూ ఉంటారు పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు.

 అయితే ఇలా విరాట్ కోహ్లీతో బాబర్ అజామ్ ను పోల్చడంపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అహ్మద్ షహజాద్  స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీతో  బాబర్ కి పోలిక ఏంటి అంటూ ఎద్దేవా చేశారు. ఈ తరంలో విరాట్ కోహ్లీ ఒక లెజెండ్ అంటూ అహ్మద్ షహజాద్ కొనియాడారు. విరాట్ కోహ్లీ ఐసీసీ టోర్నమెంట్లో అద్భుతంగా రాణిస్తూ ఉంటారు. ఆయన ఆఖరి t20 మ్యాచ్ లో కూడా చెలరేగారు. టి20 కెరీర్ ని ఆయన ఎంతో అద్భుతంగా ముగించారు. అది కోహ్లీ బ్రాండ్. ప్రస్తుత తరంలో విరాట్ కోహ్లీ కి ఎవరూ సాటిరారు అంటూ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అహ్మద్ షహజాద్ ప్రశంసలు కురిపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: