వావ్:AK -64 చిత్రంలో లక్కీ ఛాన్స్ కొట్టేసిన టాలీవుడ్ బ్యూటీ..?

Divya
కోలీవుడ్లో స్టార్ హీరోగా పేరు సంపాదించిన హీరో అజిత్ కుమార్ భాషతో సంబంధం లేకుండా ఇతర ఇండస్ట్రీలలో కూడా భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించారు. అంతేకాకుండా ఏడాదికి రెండు మూడు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంటారు అజిత్. ఇటీవలే గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో అలరించిన అజిత్ కుమార్ తన తదుపరి ప్రాజెక్ట్ కోసం కొంత గ్యాప్ ఇచ్చారు. ముఖ్యంగా ఈ మధ్య రేసింగ్ పైన  ఎక్కువగా ఫోకస్ చేసినట్లుగా కనిపిస్తోంది. తదుపరి చిత్రం డైరెక్టర్ అదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రాబోతోంది. ఈ చిత్రానికి AK -64వర్కింగ్ టైటిల్ గా ఉంది.

ఈ చిత్రానికి సంబంధించి తాజాగా సోషల్ మీడియాలో ఒక హాట్ న్యూస్ వైరల్ గా మారింది. ఇందులో హీరోయిన్గా శ్రీలీల ఫైనల్ అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఈ చిత్రంలో ఒక కీలకమైన పాత్ర కోసం మరో టాలీవుడ్ హీరోయిన్ ను చిత్ర బృందం సంప్రదించినట్లు తెలుస్తోంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు రెజీనా కసాండ్రా. గతంలో అజిత్ కుమార్ తో కలిసి  విదముయార్చి చిత్రంలో నటించారు. ఇందులో రెజీనా నెగిటివ్ పాత్రలో నటించి బాగానే పేరు సంపాదించింది.


ఇప్పుడు మరొకసారి అజిత్ కుమార్ AK -64 చిత్రంలో కూడా అలాంటి పాత్రలోనే నటించబోతున్నట్లు కోలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రెజీనా ఎలాంటి పాత్రలో నైనా సరే అద్భుతంగా నటిస్తుంది. అందుకే అజిత్ చిత్రంలో ఆమెను తీసుకున్నారని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభం కాబోతున్నట్లు ఇటీవల డైరెక్టర్ కూడా క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాలో విభిన్నమైన పాత్రలు, చాలా ఉత్కంఠభరితమైన సీన్స్ ఉండడమే కాకుండా వినోదాత్మక చిత్రం అన్నట్లుగా వినిపిస్తోంది. మొత్తానికి రెజీనా, అజిత్ సినిమాలో నటిస్తోందా? లేదా అనే విషయంపై క్లారిటీ ఇస్తుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: