లెనిన్‌లో అఖిల్ ‘బ్లైండ్ మ్యాన్’ షాక్ రిస్క్ తీసుకుంటున్న అక్కినేని హీరో!

Amruth kumar
బ్లాక్‌బస్టర్ సక్సెస్ కోసం గట్టిగా ఎదురుచూస్తున్న అఖిల్ అక్కినేని ప్రస్తుతం ‘లెనిన్’ అనే ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ – సితార ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. కమర్షియల్ హంగులతో పాటు కంటెంట్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై మొదటి నుంచే మంచి అంచనాలు ఉన్నాయి. మొదట హీరోయిన్‌గా శ్రీలీలను ఎంపిక చేసి కొంత భాగం షూటింగ్ కూడా పూర్తయ్యింది. అయితే అనుకోని కారణాలతో ఆమె ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో… ఆ స్థానంలో భాగ్యశ్రీ బోర్సేని రీప్లేస్ అయ్యారు. ఈ మార్పు తర్వాత షూటింగ్ కొంత ఆలస్యం అయినా, క్వాలిటీ విషయంలో నాగార్జున ఎక్కడా రాజీ పడటం లేదని టాక్. అందుకే లెనిన్ షూటింగ్ చాలా ప్లాన్డ్‌గా, నెమ్మదిగానే సాగుతోంది. నిజానికి ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ అవుతుందని ఫ్యాన్స్ ఆశించారు.

కానీ నిర్మాణంలో ఆలస్యం, టెక్నికల్ స్టాండర్డ్స్ విషయంలో తీసుకుంటున్న జాగ్రత్తల వల్ల విడుదల వాయిదా పడుతోంది. అయితే ఈ మధ్య లెనిన్ గురించి ఒక షాకింగ్ ట్విస్ట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అదే… అఖిల్ పాత్ర! ఇన్‌సైడ్ టాక్ ప్రకారం, లెనిన్‌లో అఖిల్ చూపులేని వ్యక్తిగా కనిపించనున్నాడు. హీరోలు అంధులుగా నటించడం తెలుగు సినిమాల్లో చాలా అరుదు. ఈ మధ్య కాలంలో రవితేజ మాత్రమే ‘రాజా ది గ్రేట్’లో ఫుల్ లెంగ్త్ బ్లైండ్ క్యారెక్టర్‌తో సూపర్ హిట్ అందుకున్నాడు. అంతకుముందు కమల్ హాసన్ లాంటి లెజెండ్స్ చేసినా… ఇలాంటి రిస్క్ తీసుకునే హీరోలు చాలా తక్కువే. ఇప్పుడు అదే ఛాలెంజ్‌ను అఖిల్ తీసుకున్నాడంటే నిజంగా సాహసమే. అయితే ఈ బ్లైండ్ క్యారెక్టర్ సినిమా మొత్తం ఉంటుందా? లేక కొంత భాగానికే పరిమితమా? అన్నది ఇప్పటికీ సస్పెన్స్. అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు కానీ… నిజమైతే మాత్రం అఖిల్ కెరీర్‌లో ఇది గేమ్ ఛేంజర్ అవుతుందన్న మాట వినిపిస్తోంది. వినరో భాగ్యము విష్ణు కథ ఫేమ్ మురళికిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్న లెనిన్… రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఇంటెన్స్ లవర్ స్టోరీగా రూపొందుతున్నట్టు సమాచారం. యాక్షన్‌తో పాటు ఎమోషన్, డెప్త్ కూడా బలంగా ఉండబోతుందట.

ఇలాంటి ఛాలెంజింగ్ రోల్స్ చేసినప్పుడే హీరోల్లో నిజమైన నటుడు బయటకు వస్తాడు. అఖిల్‌కు చిన్న వయసులోనే ఇలాంటి అవకాశం రావడం విశేషం. ప్రస్తుతం రిలీజ్ డేట్‌పై క్లారిటీ లేదు. షూటింగ్ పూర్తయ్యాక పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసే దశలో నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. 2026 సమ్మర్‌ను టార్గెట్ చేస్తున్నారట. అప్పటికి పెద్ది, ఉస్తాద్ భగత్ సింగ్, ప్యారడైజ్, విశ్వంభర లాంటి భారీ సినిమాలు లైనప్‌లో ఉండటంతో… క్లాష్ లేకుండా డేట్ ఫిక్స్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి ‘లెనిన్’తో అఖిల్ పూర్తిగా కొత్త కోణంలో కనిపించబోతున్నాడన్న మాట. ఈ రిస్క్ అతడికి బ్లాక్‌బస్టర్ తెస్తుందా? లేక మరో పరీక్షగా మిగిలిపోతుందా? అన్నది థియేటర్లలోనే తేలాలి… కానీ అంచనాలు మాత్రం ఇప్పుడు పీక్స్‌లో ఉన్నాయి!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: