కల్కి 2898 AD : కల్కి లో దిశ పటాని రోల్ ను మిస్ చేసుకున్న బ్యూటీ ఎవరో తెలుసా..?

MADDIBOINA AJAY KUMAR
సినిమా ఇండస్ట్రీలో ఒకరితో మొదటగా అనుకున్న పాత్ర కొన్ని కారణాల వల్ల వారు రిజెక్ట్ చేయడంతో వేరే వారితో చేయడం సర్వ సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఇక అలా ఓ భారీ సినిమాలో నేషనల్ క్రష్ రష్మీక మందన అవకాశాన్ని వదులుకుందట. ఇక అసలు విషయంలోకి వెళితే ... రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 AD అనే అత్యంత భారీ బడ్జెట్ సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే.

ఈ మూవీ ని వైజయంతి మూవీస్ స్వప్న సినిమాస్ బ్యానర్ పై అశ్విని దత్ కూతురు స్వప్న దత్ నిర్మించగా ... సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. బ్రహ్మానందం , రాజేంద్ర ప్రసాద్ ,  మృణాల్ ఠాకూర్ , శోభన ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించగా , విజయ్ దేవరకొండ , దుల్కర్ సల్మాన్ , ఎస్ ఎస్ రాజమౌళి , రామ్ గోపాల్ వర్మ ఈ మూవీ లో చిన్న చిన్న పాత్రలలో నటించారు. అమితా బచ్చన్ , దీపికా పదుకొనే ఈ మూవీ లో అత్యంత కీలకమైన పాత్రలలో నటించారు. ఈ మూవీ లో ప్రభాస్ కి జోడిగా దిశ పటానీ నటించింది.

ఈ సినిమాలో ఈమె పాత్ర తక్కువ నడివిలోనే ఉన్నప్పటికీ ఈమెకు ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు వచ్చింది. ఇకపోతే మొదట ఈ సినిమా దర్శకుడు అయినటువంటి నాగ్ అశ్విన్ ఈ సినిమాలో దిశా పటాని పాత్ర కోసం రష్మిక మందనను తీసుకోవాలి అనుకున్నాడట. అందులో భాగంగా ఈమెను కలిసి ఈ సినిమా కథను కూడా వివరించాడట. కథ అద్భుతంగా నచ్చినప్పటికీ ఆ సమయంలో ఈ బ్యూటీ వేరే సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమా చేయలేను అని చెప్పిందట. ఇలా ఇతర సినిమాలతో ఎంతో బిజీగా ఉండడం వల్ల రష్మిక కల్కి లో హీరోయిన్ అవకాశాన్ని వదులుకున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే రష్మిక మాత్రం ప్రస్తుతం అనేక క్రేజీ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా కెరీర్ ను ముందుకు సాగిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: