ప్రభాస్ ని అవమానించిన బ్యూటీకి షాకిస్తున్న ఫ్యాన్స్?

Purushottham Vinay
ప్రభాస్ ని అవమానించిన బ్యూటీకి షాకిస్తున్న ఫ్యాన్స్?

 ప్రభాస్ హీరోగా యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఎపిక్ సైన్స్ ఫిక్షన్‌గా రూపొందిన కల్కి 2898 ఏడీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల ఊచకోత కోస్తున్నది. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సీ అశ్వినీదత్ 600 కోట్లతో రూపొందించిన ఈ మూవీ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నది.అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకోన్ నటించిన ఈ సినిమా అదరగోడుతుంది. అతి త్వరలో రూ. 1000 కోట్లు సాధిస్తుందని అంతా భావిస్తున్నారు. ఈ క్రమంలో.. కల్కిలో నటించిన నటి అన్నాబెన్ తన సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ షేర్ చేసి ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి ట్రోల్స్ ఎదుర్కొంటుంది. ఓ నెటిజన్ కల్కిపై ఇచ్చిన రివ్యూ షేర్ చేసింది. కానీ అందులో ప్రభాస్ నటనను కించపరిచే విధంగా చెప్పాడు. కానీ దానిని అన్నాబెన్ చూసుకోకుండా స్క్రీన్ షాట్ షేర్ చేయడంతో.. డార్లింగ్‌ను ఘోరంగా అవమానించిందని ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.


ఇక ఆ పోస్టులో ఏముందంటే.. '' అమితాబ్ సర్‌ది లైఫ్ టైమ్ క్యారెక్టర్. చాలా ఆనందంగా అనిపించింది. ఆయనను తెరపై చూడటం కోసమైనా కల్కి సినిమాను మళ్లీ మళ్లీ చూస్తూనే ఉంటాను. నాకు అమితాబ్ కనిపించిన ప్రతిసారి కళ్లలో ఆనంద బాష్పాలు వచ్చాయి. ఇక కమల్ హాసన్ నాకు సెనేటర్ వైబ్స్ ఇచ్చారు. ఆయన పాత్రలో చాలా పర్‌ఫెక్ట్‌గా నటించారు. సినిమా మొత్తం స్టార్స్ వార్‌లా అనిపించింది. చలనచిత్ర ప్రపంచానికి అభిమాని కావడం వల్ల కల్కి చూడటం చాలా మంచి అనుభూతిని కలిగించింది. అలాగే సహజమైన స్త్రీ పాత్రలు దీపికా పదుకొణె ఆమె అలా నటిస్తుందని అనుకోలేదు. పాత్రలో లీనమైపోయింది. నా ఫేవరెట్ గర్ల్ బెనన్నా లవ్, వాట్ ఎ ఫైర్ క్రాకర్ ఫెర్ఫార్మెన్స్ అన్ని సీన్స్‌లో మ్యాడ్ మ్యాక్స్ మూవీ సిరీస్ వైబ్‌లను దక్కించుకుంది.ఇంత గొప్ప సినిమాలో అన్నా బెన్  లెజెండ్స్ అందరితో స్క్రీన్ షేర్ చేసుకోవడం చూసి చాలా గర్వంగా ఉంది. ఫస్ట్ హాఫ్‌లో కొన్ని కొన్ని సీన్స్ తొలగించి సినిమాను నిజమైన క్లాసిక్‌గా మార్చవచ్చని నేను భావించాను. ప్రభాస్ తమాషాగా చేసిన కామెడీ చాలా భయంకరంగా అనిపించింది. మూవీ ఫీల్‌కి ఏమాత్రం సరిపోని సాంగ్ సీక్వెన్స్. అంతేకాకుండా ఇది కేవలం సినిమా మేకింగ్‌లోఅద్భుతంగా ఉంది. భారతీయ సినిమాని సరికొత్త స్థాయికి తీసుకెళ్లారు నాగ్ అశ్విన్'' అని రాసుకొచ్చాడు. ఈ పోస్ట్‌ను అన్నా బెన్ ఈ పోస్ట్ ని ఇంస్టాగ్రామ్ లో స్టోరీలో షేర్ చేయడంతో ఫ్యాన్స్ ఈ బ్యూటీ పై ఫైర్ అవుతున్నారు.డార్లింగ్‌ను ఘోరంగా అవమానించిందని ట్రోల్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: