అల్లు అర్జున్ ఎంట్రీ కోసం మొదట అనుకున్న దర్శకుడు అతనే.. కానీ లాస్ట్ మీ నెట్ లో ట్విస్ట్..?

MADDIBOINA AJAY KUMAR
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు. అల్లు అర్జున్ దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన గంగోత్రి మూవీ ద్వారా హీరోగా వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ సినిమాలో ఇతను మంచి నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అలాగే ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ఈ సినిమా ద్వారా అల్లు అర్జున్ కు కూడా మంచి గుర్తింపు లభించింది.

ఇకపోతే అల్లు అర్జున్ , రాఘవేంద్రరావు కాకుండా మరో దర్శకుడి సినిమా ద్వారా వెండి తెరకు పరిచయం చేయాల్సింది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆదర్శకుడి తో సినిమా క్యాన్సిల్ కావడం వల్ల రాఘవేందర్రావుకు ఆ అవకాశం వచ్చింది. మరి అల్లు అర్జున్ మొదటి సినిమా చేయవలసింది ఏ దర్శకుడితో ..? ఆ మూవీ ఎందుకు క్యాన్సల్ అయింది ..? అందులోకి రాఘవేంద్రరావు ఎలా వచ్చారు అనే వివరాలను తెలుసుకుందాం. అల్లు అర్జున్ తండ్రి అయినటువంటి అల్లు అరవింద్ , అల్లు అర్జున్ ను ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇప్పించాలి అనుకున్న సమయంలో దర్శకుడు తేజ తో ఆయనను సినీ పరిశ్రమలోకి తీసుకురావాలి అని అనుకున్నారు.

అందులో భాగంగా తేజ తో కథా చర్చలు జరిగాయి. ఆల్మోస్ట్ అందరికీ కథ నచ్చడం జరిగింది. సినిమా మరికొన్ని రోజుల్లోనే స్టార్ట్ కానుంది అనే సమయంలో కొన్ని కారణాల వల్ల ఆ మూవీ ఆగిపోయింది. ఇక అప్పటికే నిర్మాత అశ్వినీ దత్ , తేజ తో అల్లు అర్జున్ మొదటి సినిమా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆయనతో రెండవ సినిమా చేయాలి అని అనుకున్నాడట. ఇక తేజ మూవీ క్యాన్సిల్ కావడంతో అశ్విని దత్ , రాఘవేంద్రరావు ను కలిసి అల్లు అర్జున్ , తేజ తో చేయవలసిన సినిమా ఆగిపోయిందట. మనము అతన్ని లాంచ్ చేద్దామా అని అడిగాడట. వెంటనే రాఘవేంద్రరావు ఓకే చేసేద్దాం అని చెప్పాడట. అలా తేజాతో లాంచ్ కావాల్సిన అల్లు అర్జున్ రాఘవేందర్ రావు తో వెండి తెరకు పరిచయం అయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: