రెండోరోజు కుమ్మేసిన యుఐ.. ఉపేంద్ర అస్సలు తగ్గడం లేదుగా..?

Pulgam Srinivas
కన్నడ సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో ఉపేంద్ర ఒకరు . ఇకపోతే ఈయన ఎన్నో సినిమాల్లో హీరో గా నటించి ఎన్నో విజయాలను అందుకున్నాడు. అలాగే తాను స్వయంగా ఎన్నో సినిమాలకు దర్శకత్వం కూడా వహించాడు . ఇది ఇలా ఉంటే ఉపేంద్ర నటించిన ఎన్నో సినిమాలు తెలుగు లో విడుదల అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర కూడా అద్భుతమైన విజయాలు సాధించడంతో ఉపేంద్ర కు తెలుగు సినీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు ఉంది.

ఇకపోతే ఉపేంద్ర తెలుగు లో కొన్ని సినిమాల్లో కీలక పాత్రలలో కూడా నటించాడు. కొంత కాలం క్రితం ఈయన అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఉపేంద్ర "యుఐ" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ ని తెలుగు లో కూడా విడుదల చేశారు. ఈ సినిమా విడుదల సందర్భంగా ఈయన రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున ప్రమోషన్ లను కూడా నిర్వహించాడు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి మొదటి రోజు కాస్త మిక్స్ డ్ టాక్ వచ్చిన రెండవ రోజు మాత్రం ఈ సినిమాకు అద్భుతమైన హోల్డ్ దక్కింది. ఇకపోతే ఈ సినిమాకు రెండవ రోజు బుక్ మై షో లో 120.37 టికెట్లు 24 గంటల్లో సేల్ అయ్యాయి. ఇలా రెండవ రోజు ఈ సినిమాకు సంబంధించిన టికెట్స్ బుక్ మై షో లో సూపర్ గా సేల్ అయ్యాయి. ఇకపోతే ఈ సినిమా ఏ స్థాయి కలెక్షన్లను చేసి ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: