పిల్లల విషయంలో వెంకటేష్ తో నీరజకి అంత పెద్ద గొడవ జరిగిందా.?

Pandrala Sravanthi
దగ్గుబాటి వెంకటేష్ నీరజ ల వివాహం 1985లో జరిగింది.వీరి వివాహం జరిగి ఇప్పటికీ దాదాపు 40 ఏళ్లు కావస్తుంది.40 ఏళ్ల వీరి సంసార జీవితంలో ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా గొడవలు జరగలేదు. అయితే చిన్న చిన్న గొడవలు జరిగినప్పటికీ అందరి వైవాహిక జీవితంలో జరిగే గొడవలే. వాటిని అంతగా హైలైట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఓ రెండు విషయాలు మాత్రం విక్టరీ వెంకటేష్ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేము. అదేంటంటే హీరోయిన్ సౌందర్య మోజులో పడి వెంకటేష్ భార్య నీరజకు విడాకులు ఇచ్చి సౌందర్యని పెళ్లి చేసుకోవాలనుకున్నారనే వార్త అప్పట్లో తెగ వినిపించింది. అంతేకాకుండా హీరోయిన్ మీనా తో కూడా వెంకటేష్ కి ఇలాంటి ఎఫైర్ వార్తలు వినిపించాయి.కానీ ఈ రెండు వార్తల్లో ఏది నిజం కాలేదు.

ఈ విషయం పక్కన పెడితే వెంకటేష్ నీరజల మధ్య కేవలం హీరోయిన్ల విషయంలోనే కాకుండా పిల్లల విషయంలో కూడా అప్పట్లో గొడవ పెద్దగానే జరిగిందట. ఇక అసలు విషయం ఏమిటంటే..వెంకటేష్ నీరజల అన్యోన్య బంధానికి గుర్తుగా నలుగురు పిల్లలు పుట్టారు. వీరికి మొదట ముగ్గురు అమ్మాయిలు పుట్టారు. ఇక ముగ్గురు అమ్మాయిలు పుట్టడంతో వెంకటేష్ తనకి మగ పిల్లాడు పుట్టాడు అనుకొని ఇక చాలు ఆరోగ్యం పాడవుతుంది.ఇక్కడితో ఆపరేషన్ చేయించుకుందాం అని వెంకటేష్ చెప్పారట..

కానీ వెంకటేష్ భార్య నీరజ మాత్రం వద్దు మామయ్య రామానాయుడు కోరిక ప్రకారం మనకు మగపిల్లాడు కచ్చితంగా పుడతాడు. మరోసారి చూద్దాం అని అపరేషన్ చేయించుకోవడానికి ఇష్టపడలేదట.అయితే ఈ విషయంలో వెంకటేష్ కి నీరజకి మధ్య చిన్నపాటి గొడవలు జరిగాయట. ఇక తర్వాత వెంకటేష్ కూడా ఈ ఒక్కసారికి చూద్దాం అని సైలెంట్ అయిపోయారట. అలా నాలుగవసారి వెంకటేష్ కి కొడుకు పుట్టాడు.అలా మామయ్య రామానాయుడు కి మనవళ్లు అంటే ఇష్టం అనే ఉద్దేశంతో నీరజ మామయ్య కోరిక తీర్చాలని వెంకటేష్ తో గొడవపడి మరీ అబ్బాయి పుట్టే వరకు ఉంచుకుందట. అలా పిల్లల విషయంలో వెంకటేష్ కి నీరజకి మధ్య చిన్నపాటి గొడవలు జరిగాయట

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: