కల్కి 2898 AD : ఆ విషయంలో "అలా వైకుంఠపురంలో" మూవీని బీట్ చేయలేకపోయినా కల్కి..!

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా కల్కి 2898 AD అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అమితా బచ్చన్ , దీపికా పదుకొనే కీలక పాత్రలలో నటించగా ... బ్రహ్మానందం , రాజేంద్ర ప్రసాద్ , మృణాల్ ఠాకూర్ , శోభన ఈ మూవీ లో ముఖ్య పాత్రాలలో నటించారు. విజయ్ దేవరకొండ , దుల్కర్ సల్మాన్ , ఎస్ ఎస్ రాజమౌళి , రామ్ గోపాల్ వర్మ ఈ మూవీ లో చిన్న చిన్న పాత్రలలో నటించారు. దిశా పటనీ ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా నటించింది.

ఇకపోతే ఈ సినిమా జూన్ 27 వ తేదీన విడుదల అయ్యి ఇప్పటి వరకు 8 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఇకపోతే ఈ సినిమాకు ఇప్పటి వరకు సూపర్ సాలిడ్ కలెక్షన్లు ప్రపంచవ్యాప్తంగా దక్కాయి. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మూవీ కి అద్భుతమైన కలెక్షన్లు దక్కాయి. 8 వ రోజు విషయంలో మాత్రం ఈ సినిమా కాస్త వెనకబడిపోయింది. దానితో ఈ మూవీ 8 రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్ వసూలు చేసిన సినిమాల లిస్టులో మూడవ స్థానంలో ఉంది.

ఈ మూవీ కంటే ముందు రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల అయిన 8 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 8.33 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసి మొదటి స్థానంలో నిలవగా , ఆ తర్వాత అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన అలా వైకుంఠపురంలో సినిమా 7.92 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి రెండవ స్థానంలో నిలిచింది. ఇక మూడవ స్థానంలో కల్కి 2898 AD సినిమా 7.52 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసి 3 వ స్థానంలో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: