KCR గేమ్ చేంజర్ అవ్వాలంటే అలా చెయ్యాల్సిందే?

Purushottham Vinay

• kcr ప్రతిపక్షాలపై విమర్శలు ఆపి తనని తాను మార్చుకుంటారా?


• kcr ఆహాన్ని వీడి ఆలోచించడం మొదలు పెడతారా?


• kcr రాజకీయ ప్రయోజనాలు కోసం కాకుండా రాష్ట్రం గురించి ఆలోచిస్తారా? 


తెలంగాణ - ఇండియా హెరాల్డ్ : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో కష్టపడి సాధించిన తర్వాత కేసీఆర్‌ ఏకంగా పదేళ్ల పాటు తెలంగాణలో అంతులేని ఆధిపత్యం సాధించి తెలంగాణకి రాజులా ఫీల్ అయ్యాడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాక.. మొదట్లో అద్భుతంగా పాలన చేశాడు. ఏకంగా ఆంధ్రా ప్రజలే అబ్బా నాయకుడంటే ఇతనేరా అని మెచ్చుకునేలా పాలన చేసి చూపించాడు. తన ప్రత్యర్థులు కనీసం తన దారిదాపుల్లోకి కూడా రానివ్వలేనంత ఎత్తుకు ఎదిగాడు.కానీ.. రానురాను తన మితిమీరిన అహంభావంతో తెలంగాణ ప్రజల దృష్టిలో చాలా బ్యాడ్ అయ్యాడు.జనంతో తగ్గిపోయిన సంబంధాలు, అడుగడుగునా కుటుంబ పెత్తనం, రాజరికపు పోకడలు..తెలంగాణకి తానే మకుటం లేని మహా రాజు అనుకోవడం ఇవన్నీ కూడా కేసీఆర్‌ కొంప ముంచాయి. రాజకీయ జీవితాన్ని పతనం చేశాయి.


ఇక గత ఎన్నికల్లో చాలా దారుణాతి దారుణంగా ఓటమి పాలైన కేసీఆర్‌.. ఆ తర్వాత చాలా ఇబ్బందుల్లో పడ్డారు. విచిత్రం ఏంటంటే 10 ఏళ్ళు తెలంగాణకి సీఎం అయిన కెసిఆర్  పార్లమెంటు ఎన్నికల ఫలితాల్లో కనీసం ఒక్క స్థానం కూడా గెలవకపోవడం ఆయనకి ఉన్న అనుభవానికి నిజంగా సిగ్గు చేటనే చెప్పాలి. దీనికి తోడు ఆయన ఎమ్మెల్యేలు కూడా వరుస పెట్టి మరీ BRS ని వీడి కాంగ్రెస్ పార్టీకి వరద బాధితుల్లా వలస వెళ్లిపోతున్నారు. కెసిఆర్ తెలంగాణ సీఎంగా పైకి ఎంత ఎత్తుకి వెళ్ళాడో తన అహంకారం వల్ల అంత దారుణంగా అంత ఎత్తు కింద పడ్డాడు. అతి విశ్వాసంతో trs అనే ప్రాంతీయ పార్టీని BRS అనే జాతీయ పార్టీగా మార్చాడు. ముఖ్య మంత్రి నుంచి ప్రధాన మంత్రి కావాలనుకున్న కెసిఆర్ కి ఇప్పుడు కనీసం తెలంగాణ సీఎం సీటు తెచ్చుకోవడం కూడా కష్టం అయ్యింది. కాంగ్రెస్, బీజేపీ తెలంగాణలో దూసుకుపోతున్న క్రమంలో BRS పుంజుకోవాలంటే కెసిఆర్ ఖచ్చితంగా తన స్వభావాన్ని మార్చుకోవాల్సిందే. లేకుంటే నెక్స్ట్ గేమ్ చేంజర్ అవ్వలేడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: